Goddess Parvati : పార్వతి దేవికి గర్భ శాపం పెట్టిందెవరు? ఆ ముగ్గురు సంతానం ఎవరు?

పార్వతీ 9 నెలల పాటు కడుపులో మోయలేదు. ఎందుకంటే అప్పటికే పార్వతి గర్భ శాపంతో ఉంది. అయినా వీరు సంతానం ఉన్నట్లు చెబుతారు. అయితే పార్వతీ దేవికి గర్భ శాపం ఇచ్చిన వారు ఎవరు? ఆ తరువాత ముగ్గురు సంతానం ఎలా అయ్యారు?

Written By: Chai Muchhata, Updated On : August 16, 2024 10:01 am

Goddess Pravathidevi

Follow us on

Goddess Parvati : ఆది దంపతులు అనగానే శివ పార్వతుల గురించి చెప్పుకుంటారు. ఒక కుటుంబం ఎలా ఉండాలో శివ పురాణం గురించి చదివితే అర్థమవుతుందని అంటారు. శివ పురాణం ప్రకారం.. భార్య భర్తలు, పిల్లల మధ్య జరిగే సంబంధాల గురించి శివ పార్వతులే ఆదర్శం అని అంటారు. త్రిమూర్తుల్లో బ్రహ్మ, విష్ణు గురించి చెప్పేటప్పుడు సంతానం ప్రస్తావన రాదు. కానీ పార్వతీ పరమేశ్వరుల గురించి వివరించేటప్పుడు వారి కుమారులు, కుమార్తె గురించి చెబుతూ ఉంటారు. ఆది దంపతులకు గణేశుడు, కుమార స్వామి కుమారులతో పాటు అశోక సుందరి అనే కుమార్తె ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. అయితే వారెవరినీ పార్వతీ 9 నెలల పాటు కడుపులో మోయలేదు. ఎందుకంటే అప్పటికే పార్వతి గర్భ శాపంతో ఉంది. అయినా వీరు సంతానం ఉన్నట్లు చెబుతారు. అయితే పార్వతీ దేవికి గర్భ శాపం ఇచ్చిన వారు ఎవరు? ఆ తరువాత ముగ్గురు సంతానం ఎలా అయ్యారు?

శివ పార్వతుల గురించి చెప్పాలంటే శివపురాణం చదవాల్సిందే. ఈ పురాణం ప్రకారం తారకాసురుడి గురించి తెలుసుకోవాలి. ఈయన వజ్రంగ్ కుమారుడు. తారకాసురుడు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేస్తాడు. ఆ తరువాత తన తపస్సును మెచ్చిన బ్రహ్మదేవుడు తారకాసురుడికి దర్శనమిచ్చి వరం కోరుకోమంటాడు. దీంతో తారకాసురుడు తనకు ఈ ప్రపంచంలో ఏదీ బలంగా కనిపించకూడదని కోరుతాడు. అలాగే ఎప్పటికీ అమరుడిగా ఉండే వరం ఇవ్వాలని అంటాడు. దీంతోబ్రహ్మదేవుడు తారకాసురుడికి కోరిన వరాలు ఇస్తాడు.

అయితే ఈ వరాలు పొందిన తారకాసురుడు పట్ట పగ్గాలు లేకుండా వ్యవహరిస్తాడు. ఇష్టమొచ్చిన రీతిలో రాజ్యాలను దోచుకుంటాడు. దేవతలను భయపెడుతాడు. చివరికి ఇంద్రుడిని కూడా భయపెట్టి తన ఆధిపత్యాన్ని లాక్కూంటాడు. అలాగే తన వద్ద ఉన్న ఐరావతం ఏనుగు, గుర్రాలను దోచుకుంటాడు. సాధారణ మానవులను సైతం హింసిస్తూ క్రూరంగా ప్రవర్తిస్తాడు. అతడు సృష్టించిన బీభత్సానికి భయపడిపోయిన దేవతలు బ్రహ్మదేవుడి వద్దకు వస్తారు. అయితే తాను తారకాసురుడి తపస్సుకు మెచ్చి వరం ఇవ్వాల్సి వచ్చిందని, ప్రస్తుతం ఏం చేయలేనని అంటాడు.

అయితే ఇందుకు పరిష్కారం ఉందన్నాడు బ్రహ్మదేవుడు. పార్వతి దేవికి కలిగిన సంతానం తారకాసురుడు నాశనం అవుతారని అంటాడు. అయితే అప్పటికే పార్వతీ దేవి యోగాగ్నిలో భాగంగా తన శరీరాన్ని భస్మం చేసుకుంటుంది. దీంతో సతీదేవి మళ్లీ పుట్టి శివుడితో వివాహం జరుగుతుందని అంటాడు. అలా మళ్లీ జన్మించిన పార్వతి దేవీ శివుడి అనుగ్రహం కోసం బ్రహ్మదేవుడి సాయం కోరుతుంది. దీంతో దేవతలంతా కలిసి మన్మధుడిని శివుడి వద్దకు పంపుతారు. కానీ తన తపస్సను భగ్నం చేసిన మన్మథుడిని శివుడు భస్మం చేస్తాడు. ఇది తెలుసుకున్న మన్మథుడి భార్య రతి దేవి శోకిస్తుంది. దీంతో మన్మథుడి భస్మం చేతబట్టుకొని తనకు తల్లి కాకుండా చేసినందుకు నీవు కూడా కడుపులో నుంచి ఎలాంి బిడ్డకు జన్మనివ్వకూడదు అని శపిస్తుంది. అయితే శివుడి కోపం తరువాత ఈ విషయాలను దేవతలు వివరిస్తారు.

అయితే తారకాసురుడి నాశనం కోసం పార్వతి దేవి సంతానం కావాలి. దీంతో పార్వతి పసుపుతో గణపతికి జీవం పోస్తుంది. ఆ తరువాత తన ఒంటరి తనాన్ని అధిగమించడానికి పార్వతి దేవి ఒక చెట్టు నుంచి వరం కోరుతుంది. దీంతో అశోక సుందరి జన్మిస్తుంది. ఆ తరువాత తారకాసురుడిని వధించడానికి కుమార స్వామి జన్మిస్తాడు. ఇలా పార్వతి దేవి కడుపున కాకుండా వరం వల్ల సంతానం అవుతారు.