https://oktelugu.com/

Tollywood News : చిరంజీవి, కమల్ హాసన్, రజినీకాంత్ ముగ్గురు కలిసి చేయాల్సిన సినిమా ఎలా మిస్ అయిందో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీ లో ఒక హీరో సూపర్ సక్సెస్ అవ్వడానికి ఆయన ఎంచుకున్న కథలు, ఆయా సినిమాల్లో ఆయన చేసిన నటన ఒకెత్తు అయితే ఇక్కడ సక్సెస్ లు కూడా చాలా కీలక పాత్ర వహిస్తూ ఉంటాయి....

Written By:
  • Gopi
  • , Updated On : August 16, 2024 / 09:41 AM IST

    Tollywood News

    Follow us on

    Tollywood News :  తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్లందరూ వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్లేవారు. ఇక ఇలాంటి క్రమంలోనే అప్పుడున్న హీరోలు కూడా మంచి విజయాలను అందుకుంటు ప్రేక్షకుల మెప్పు పొందుతూ ఉండేవారు. ఇక ప్రస్తుతం చిరంజీవి లాంటి స్టార్ హీరో మెగాస్టార్ గా గత 40 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాడు అంటే అందులో చిరంజీవి గొప్పతనం ఎంత ఉందో ఆయనతో సినిమాలను చేసి ఆయనకు సక్సెస్ లను అందించిన దర్శకుల గొప్పతనం కూడా అంతే ఉంది. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కే రాఘవేంద్రరావు డైరెక్టర్ గా ఒక వెలుగు వెలిగారు. ఇక కమర్షియల్ సినిమాలకు పెట్టింది పేరుగా ఆయన గుర్తింపును సంపాదించుకొని వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతూ వచ్చాడు. ఇక ఈయన తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరితో సినిమాలు చేసి అందరికీ సూపర్ సక్సెస్ లను అందించాడు. దీంతో తమిళ్ సినిమా హీరోలు కూడా ఆయనతో సినిమా చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ అది వర్కౌట్ కాలేదు. ఇక ఒకానొక సందర్భంలో రాఘవేంద్రరావు చిరంజీవి, కమల్ హాసన్, రజనీకాంత్ ముగ్గురిని పెట్టీ ఒక భారీ మల్టీస్టారర్ సినిమా చేయాలని ప్లాన్ చేశాడు.

    కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఈ ముగ్గురి కాంబినేషన్ లో కనక సినిమా వచ్చుంటే అది ఇండియాలోనే బిగ్గెస్ట్ సక్సెస్ గా నిలిచేది అంటూ అప్పట్లో కొన్ని మ్యాగజైన్స్ లో కూడా కథనాలు రావడం విశేషం… నిజానికి రాఘవేంద్రరావు లాంటి దర్శకుడి వల్ల అది సాధ్యమయ్యేది. కానీ కథ పరంగా అందరి ఇమేజ్ ను బ్యాలెన్స్ చేయలేకపోవడం వల్లే ఆ కథని పక్కన పెట్టేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే చిరంజీవి రాఘవేంద్రరావు కాంబినేషన్ లో ఎన్నో సూపర్ డూపర్ సక్సెస్ సినిమాలు వచ్చాయి.

    అందులో జగదేకవీరుడు అతిలోకసుందరి, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు లాంటి సినిమాలు ఉండడం విశేషం…ఇక చిరంజీవి మెగాస్టార్ గా కొనసాగడంలో ఆయన పాత్ర చాలా వరకు ఉందనే చెప్పాలి. రజినీకాంత్ కూడా రాఘవేంద్రరావుతో ఒక సినిమా చేయాలని భారీ ప్రణాళికలను చేశాడు. కానీ అది వర్కౌట్ కాలేదు కారణం ఏదైనా కూడా రాఘవేంద్రరావు ఆయనతో సినిమా చేయలేకపోవడం అనేది ఒక వెలితిగానే చెప్పాలి. ఇక రజనీకాంత్ కూడా తనకు కమర్షియల్ గా భారీ గుర్తింపు రావాలనే ఉద్దేశంతో సినిమా చేయడానికి సిద్ధపడ్డాడు కానీ అది కార్య రూపం దాల్చలేదు…

    ఇక ఇదిలా ఉంటే డైరెక్టర్ రాఘవేంద్రరావు ప్రస్తుతం సినిమాలు చేయకుండా రెస్ట్ తీసుకుంటుంటే చిరంజీవి, కమలహాసన్, రజినీకాంత్ లు మాత్రం భారీ సినిమాలను చేస్తూ పాన్ ఇండియాలో భారీ సక్సెస్ లను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఈ ఏజ్ లో కూడా ఇంత శ్రమిస్తూ మంచి సక్సెస్ లను అందుకుంటూ ముందుకు సాగుతున్నారు.