Kartik Amavasya day : ఆధ్యాత్మిక మాసంగా పిలిచే కార్తీక మాసం డిసెంబర్ 1తో ముగుస్తుంది. ఈరోజు అమావాస్య కారణంగా.. నెలరోజుల చేసిన పుణ్యం కంటే ఈరోజు చేసే కొన్ని పనుల వల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్రం తెలుపుతుంది. ప్రతీ నెల అమావాస్య, పౌర్ణమి వస్తుంటాయి. కానీ కార్తీక మాసం చివరి రోజున వచ్చే అమావాస్యకు విశిష్టత ఉంది. కొన్ని పురాణాల ప్రకారం ఈ అమావాస్య రోజున చేసే దానం అన్నింటికన్నా ఎక్కువ ఫలాన్ని ఇస్తుందని నమ్ముతారు. అలాగే ఈరోజు నదీ స్నానం చేయడం వల్ల అన్నీ శుభాలే జరుగుతాయని నమ్ముతారు. అయితే కార్తీక మాస అమావాస్య రోజున కొన్ని రాశుల వారు దానాలు చేయడం వల్ల విశేష ఫలితాలు పొందుతారు. మరి వీరు ఎటువంటి దానాలు చేయాలి? ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించాలి? ఆ వివరాల్లోకి వెళితే..
సాధారణంగా ఎవరైనా దయాగుణులు దానం చేస్తారు. కానీ విశిష్టత కలిగి రోజుల్లో చేసే పుణ్యకార్యాలు ఎంతో ఫలాన్ని ఇస్తాయి. ఇక జాతక చక్రం ప్రకారం కొన్ని రాశుల వారికి కొన్ని రోజులు కలిసి రానున్నాయి. దీంతో వారు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తే తమకు అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి. తమ శక్తీ కొద్దీ ఈరోజు చేసిన ఏ కార్యమైనా ప్రతిఫలమే ఉంటుంది. 2024 డిసెంబర్ 1న అమావాస్య ఉండనుంది. అయితే అమావాస్య తిథి శనివారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమై ఆదివారం ఉదయం 11.51 నిమిషాలకు పూర్తవుతుంది. ఈ క్రమంలో ఈ రాశుల వారు ఏమేం చేయాలంటే?
రాశి చక్రమాల్లో మొదటి రాశి మేషం కలిగిన వారు అమావాస్య రోజున చిక్కుడు గింజలు రాగిపిండి దానం చేయాలి. పితృదేవతలను స్మరిస్తూ వీటిని ఇవ్వడం వల్ల ఎంతో సంతోషిస్తారు. వృషభ రాశికి చెందిన వారు పెసళ్లు, కూరగాయలు, పండ్లు దానం చేయాలి. అలాగే పెరుగు అన్నం, నెయ్యి దీపం వంటివి దానం చేయాలి. మిథున రాశి వారు అమావాస్య రోజున ఆహార పదార్థాలు దానం చేయాలి. ఇవి ఆకుపచ్చ కూరగాయలతో ఉంటే మరీ మంచిది. కర్కాటక రాశి వారు ఇతరులకు బియ్యం, గోధుమలు, ఉప్పు, పంచదార వంటివి దానం చేయాలి.
సింహారాశి వారు అమావాస్య రోజున రాగి పిండి, ఎండు మిరపకాయలు దానం చేయాలి. గోధుమ పిండి ఇచ్చినా సరిపోతుంది. కన్య రాశికి కలిగిన వారు పెసళ్లు, పప్పు దానం చేయాలి. అలాగే డబ్బులు దానం చేసిన మంచి ఫలితాన్ని ఇస్తాయి. తులా రాశివారు బియ్యం పిండితో పాటు ఉప్పు వంటివి దానం ఇవ్వవచ్చు. వృశ్చిక రాశి వారు రాగులు, పప్పు లేదా దుంపలకు సంబంధించినవి దానం చేయాలి. ధనుస్సు రాశికి చెందిన వారు అరటిపళ్లు, బొప్పాయి, శెనగపిండి దానం చేయాలి. వీటితో పాటు పసుపు రంగు వస్త్రాలను కూడా ఇవ్వొచ్చు.
మకర రాశి వారు నలుపు రంగు దుస్తులను ఇవ్వాలి. ఆవాలు, నువ్వుల నూనె వంటివి దానం ఇవ్వొచ్చు. కుంభ రాశికి చెందిన వారు దుప్పట్లు, తోలు వస్తువులు, చెప్పులు దానం చేయాలి. మీన రాశికి చెందిన వారు శెనగలు, సత్తుపిండి వంటివి దానం చేయాలి. అరటి కాయలను కూడా ఇవ్వాలి.