Flights Canceled: ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సుంకాలను విధించే పనిలో ఉండగా.. మరోవైపు ఆ దేశంలో ప్రయాణ సాధనాల్లో అంతరాలు ఏర్పడుతున్నాయి. తాజాగా అమెరికాలోని కొన్ని విమాన సర్వీసులు ఆలస్యంగా సాగగా.. మరికొన్ని విమానాలు పూర్తిగా రద్దయ్యాయి. ప్రపంచంలోని పని దేశాలతో సంబంధాలు ఉన్న అమెరికాలో ఇలాంటి పరిస్థితి ఎదురు కావడం వల్ల చాలా దేశాలకు సమస్యలు ఏర్పడ్డాయి. ఎందుకంటే ఈ విమాన సర్వీసుల ద్వారా కేవలం ప్యాసింజర్స్ మాత్రమే కాకుండా కొన్ని వస్తువుల రవాణా కూడా నిలిచిపోయింది. అసలు ఈ విమాన సర్వీసులు రద్దు కావడానికి కారణం ఏంటి?
Also Read: రేవంత్ శత్రువును చంపలేదు.. ఓడించాడు
బుధవారం రాత్రి నాటికి 800 విమానాలు రద్దు అయినట్లు తెలుస్తోంది. హ్యూస్టన్ లోని టెర్మినల్ మొత్తం ప్రయాణికులతో నిండిపోయింది. ట్రాక్ లపై ఎక్కడికక్కడే విమానాలు నిలిచిపోయాయి. అయితే విమానాలు రద్దు కావడానికి సాంకేతిక సమస్యలే కారణమని యునైటెడ్ ఎయిర్లైన్స్ సంస్థ తెలిపింది. ఇప్పటివరకు జరిగిన సాంకేతిక సమస్యలను పరిష్కరించే పనిలో ఉన్నట్లు ఆ సంస్థ అధికారికంగా తెలిపింది.
విమానాలు రద్దు కావడంతో ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేటర్ (FAA)కూడా స్పందించింది. విమానాల రద్దుకు సాంకేతిక సమస్య అని యునైటెడ్ సంస్థ పేర్కొన్నట్లు.. ఎఫ్ ఏ ఏ పేర్కొంది. అయితే ఒక్కచోట ఈ సమస్య ఉండడంతో దేశవ్యాప్తంగా విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఆదేశించామని తెలిపింది. మొత్తంగా 826 విమాన సర్వీసుల్లో అంతరాయం కలగగా.. 23 విమానాలు పూర్తిగా రద్దు అయినట్లు అమెరికా మీడియా పేర్కొంది. విమానాల రద్దుతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ విమానాలు తిరిగి కొనసాగించడానికి సమయం పడుతుందని తెలపడంతో ప్రయాణికులు టెర్మినల్స్ లో నిరీక్షిస్తున్నారు.
అయితే చికాగోలోని ఎయిర్లైన్స్ విమాన సంస్థలు ఒక ప్రకటనలు విడుదల చేశాయి. ప్రయాణికుల సౌకర్యార్థం కోసమే విమానాలను రద్దు చేశామని చెప్పారు. సాంకేతిక సమస్యల వల్ల 35% విమానాలు ఆలస్యంగా నడుస్తాయని.. ఆరు శాతం విమానాలు పూర్తిగా రద్దు చేశామని తెలిపారు. ప్రయాణికుల భద్రతా కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని వారు పేర్కొన్నారు. మరో ఎయిర్లైన్స్ సంస్థ స్పందిస్తూ ప్రయాణికులకు అసౌకర్యం కలిగించినందుకు క్షమాపణలు చెబుతూనే.. మంచి కోసమే విమానాల సర్వీసులు రద్దు చేశామని తెలిపింది.
ఒకవైపు భారత్, అమెరికాల మధ్య సుంకాల విషయంలో చర్యలు కొనసాగుతున్న వేళ ఒక్కసారిగా ఇలా విమానాలు రద్దు కావడంపై ప్రయాణికులతో పాటు అమెరికాలో ఉండే భారతీయులు ఆందోళన చెందుతున్నారు. రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ చేసుకుంటున్న తరుణంలో ఇప్పటివరకు భారత్ పై ఉన్న 25% నుంచి 50% వరకు సుంకాలు పెంచినట్లు ట్రంపు తెలిపారు. అయితే ఇదే సమయంలో విమాన సర్వీసులు రద్దు కావడంపై తీవ్ర చర్చ సాగుతోంది.