spot_img
Homeఆధ్యాత్మికంMagha Purnima 2025 : మాఘమాస పౌర్ణమి రోజు ఎలాంటి పూజలు చేయాలి?

Magha Purnima 2025 : మాఘమాస పౌర్ణమి రోజు ఎలాంటి పూజలు చేయాలి?

Magha Purnima 2025 :  హిందూ శాస్త్ర ప్రకారం పండుగలు మాత్రమే కాకుండా ప్రత్యేక రోజుల్లో కొన్ని కార్యక్రమాలు చేయడం వల్ల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతూ ఉంటారు. సంక్రాంతి తర్వాత కొన్ని రోజులపాటు శూన్యంగా ఉండి ఆ తర్వాత వచ్చే మాఘ మాసంలో శుభదినాలు ప్రారంభమవుతాయి. ఈ మాసంలో ఎక్కువగా వివాహాలు జరుగుతూ ఉంటాయి. ఇదే సమయంలో కొన్ని ప్రత్యేక రోజులు వస్తూ ఉంటాయి. వీటిలో మాఘమాస పౌర్ణమి ఒకటి. మిగతా పౌర్ణమిలో కంటే మాఘమాసంలో వచ్చే పౌర్ణమి విశిష్టమైనది. ఈరోజు పితృ కార్యక్రమాలు చేయడం వల్ల పూర్వీకులు సంతోషిస్తారని చెబుతారు. ఇందులో భాగంగా నది స్నానం చేయడం చాలా మంచిది అని కొందరు చెబుతున్నారు. నది స్నానం చేయడంతో పాటు కొన్ని పుణ్య కార్యాలు చేయడం వల్ల దోషాలు తొలగిపోతాయని అంటున్నారు. అయితే ఈరోజు ఎలాంటి పూజలు చేయాలి?

2025 సంవత్సరంలో ఫిబ్రవరి 12వ తేదీన మాఘమాస పౌర్ణమి వస్తోంది. ఈరోజున నది లేదా సమీపంలోని పారే నీటిలో స్నానాలు చేయడం వల్ల వ్యాధుల భారీ నుంచి తప్పించుకోవచ్చని అంటున్నారు. అలాగే భక్తిశ్రద్ధలతో దైవాన్ని పూజించడమే కాకుండా దానధర్మాలు చేయాలి. ఈ రోజున నువ్వులు, గొడుగులు దానధర్మాలు చేయడం వల్ల గత జన్మలో ఉండే పాపాలు తొలగిపోతాయి.

అయితే మాఘమాస పౌర్ణమి రోజున పితృ కార్యక్రమాలు చేయడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయని పురాణాల్లో చెప్పబడింది. అందుకోసం ఎలాంటి పూజలు చేయాలి? అనేది తెలుసుకుందాం.
మాఘమాసం పౌర్ణమి రోజున ఉదయం నదిలో స్నానం చేయాలి. నడుములోతు నీటిలో ఉండి పవిత్ర జలాన్ని అరచేతిలోకి తీసుకొని ఆ తర్వాత పూర్వీకులను గుర్తు చేసుకోవాలి. తర్వాత బొటనవేలు చూపుడువేలు మద్యమం ద్వారా పూర్వీకులకు నీటిని సమర్పించాలి. ఈ రోజున నల్ల నువ్వుల సహాయంతో పితృదేవతలకు తర్పణం సమర్పించాలి. ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతృప్తి చెంది ఆశీస్సులు అందిస్తారు.

ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత పితృదేవతలను ప్రసన్న చేసుకోవడానికి ఆహారం, వస్త్రాలను ఇతరులకు దానం చేయాలి. వీటిలో ముఖ్యంగా తెల్లని రంగు దుస్తులు ఉండాలి. ఇలా దానం చేయడం వల్ల పూర్వీకులు శాంతిస్తారు. అలాగే పితృ దోషం నుండి విముక్తి పొందే అవకాశం ఉంటుంది. పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి ఈ రోజున సాయంత్రం ఆవ నూనెతో దీపాన్ని వెలిగించాలి. సూర్యాస్తమం తర్వాత నువ్వు నూనెతో దీపం వెలిగించాలి. ఇంటి బయట దక్షిణం దిశలో ఈ దీపాన్ని ఉంచాలి. ఇలా చేయడం వల్ల పూర్వీకుల కోపాన్ని తగ్గించవచ్చని చెబుతున్నారు.ఇలా చేయడం ఇలా చేయడం వల్ల పూర్వికులు సంతోషించి వారి కుటుంబ సభ్యులను చల్లని చూపుతో చూస్తారు. దీంతో వారికి ఎలాంటి ఆటంకాలు లేకుండా కార్యక్రమాలన్నీ పూర్తి చేయగలుగుతారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...
Oktelugu Epaper
Exit mobile version