Bajrang Bali : ప్రపంచవ్యాప్తంగా అనేక మంది హిందూ భక్తులు హనుమాన్ ను చాలా ఎక్కువగా పూజిస్తారు. మంగళవారం కాకుండా, ప్రతి బజరంగబలి భక్తుడు శనివారం కూడా ఆ హనుమాన్ ను పూజిస్తారు. హనుమాన్ తన బలం, ధైర్యం, చురుకుదనం, గొప్ప జ్ఞానానికి ప్రసిద్ధి చెందాడు. శివుని అవతారంగా కూడా చెబుతుంటారు. హనుమంతుడిని పూజించడానికి, ప్రార్థించడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. వాటిలో ఒకటి హనుమాన్ మంత్రాన్ని జపించడం, బజరంగబలిని ప్రసన్నం చేసుకోవడానికి అనేక మంత్రాలు ఉన్నాయి. వీటిని వివిధ సందర్భాలలో, ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. ఇంతకీ హనుమాన్ ని భజరంగ్ బలి అని ఎందుకు అంటారు?
Also Read : వచ్చే నెల వరకు ఓపిక పట్టండి.. ఈ రాశుల వారికి ఇక అదృష్టమే..
అయితే హనుమాన్ ఏడుగురు అమరులలో ఒకరిగా చెబుతుంటారు. ఎక్కడైతే రామ నామ జపం జరుగుతుందో, హనుమంతుని పూజ జరుగుతుందో అక్కడ ఆయనే ఏదో ఒక రూపంలో కనిపిస్తాడని నమ్మకం. హనుమంతుని మహిమ అనంతం. అష్ట సిద్ధులకు అధిపతి అయిన హనుమంతుడు అత్యంత శక్తిమంతుడు. తన భక్తుల పట్ల అత్యంత కరుణామయుడు. ఇక హనుమాన్ ని అనేక పేర్లతో పిలుస్తారు. పూజిస్తారు. అతను బజరంగబలి, సంకటమోచన్, హనుమాన్ , అంజని సూత్, వాయు పుత్ర వంటి అనేక ఇతర పేర్లతో పిలుస్తారు. కానీ ఈ రోజు మనం హనుమాన్ ని భజరంగ్ బలి అని పిలవడం వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకుందాం. ఇది మీకు ఏ పుస్తకంలో కూడా దొరకదు కావచ్చు.
హనుమంతుడిని ‘బజరంగ్ బలి’ అని ఎందుకు పిలిచారు?
‘బజరంగ్’ అనే పేరుకు పిడుగు అని అర్థం. ఆ పిడుగు చాలా శక్తివంతమైనది. అది కత్తి మృదువైన పండును కోసినట్లుగా వజ్రాన్ని కూడా కోయగలదు. ఇది అతని అజేయ స్వభావాన్ని, ఏదైనా అడ్డంకిని చొచ్చుకుపోయే సామర్థ్యాన్ని సూచిస్తుంది. ‘వజ్ర’ + ‘ఆంగ్’ అంటే – వజ్రంతో తయారైన శరీరం. అంటే అభేద్యమైన శరీరం. హనుమంతుడి శరీరం పిడుగులాంటి బలంతో ఉంది. దీని కారణంగా దైవికమైనా లేదా లౌకికమైనా ఏ ఆయుధమూ అతనికి హాని కలిగించలేదు. ‘బలి’ అనే పదం అతని అపారమైన శారీరక బలాన్ని, బరువైన వస్తువులను ఎత్తే శక్తిని సూచిస్తుంది.
భక్తితో సంతోషం
కష్ట సమయాల్లో దేవతలను చేరుకోవడం కష్టం కావచ్చు. కానీ హనుమాన్ జీ అలాంటి దేవుడు కాదంటారు పండితులు. తనను నిజమైన హృదయంతో పిలిచే భక్తుల సమస్యలను పరిష్కరించడానికి పరిగెత్తుకు వస్తాడు. ఆయన పేరును ఉచ్చరించడం ద్వారా భయం తొలగిపోతుందని. మనస్సు స్థిరంగా మారుతుందని, సంక్షోభం కూడా తొలగిపోతుందని నమ్ముతారు.
రీసెంట్ గా ఉత్తరప్రదేశల్ లో ఆ హనుమాన్ తన లీలను చూపించారు. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ జిల్లాలో ఒక అద్భుతం జరిగింది. దీనిని చూసి చుట్టుపక్కల ప్రజలు చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇక్కడ ఒక టాయిలెట్ తవ్వుతున్నారు. అప్పుడు కార్మికులు పార తో తవ్వుతున్నప్పుడు ఒక విగ్రహం తగిలింది. ఆ తర్వాత కార్మికులు చుట్టూ తవ్వారు. తవ్వుతున్నప్పుడు హనుమాన్ విగ్రహం బయటపడింది. ఈ వార్త వ్యాపించిన వెంటనే, దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో గుమిగూడారు. మొత్తం మీద మొన్న హనుమాన్ జయంతికి ముందు హనుమాన్ తన లీలను చూపించాడన్నమాట.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugunews.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.
Also Read : హనుమాన్ జయంతి రోజున ఇలా చేస్తే.. ఆర్థిక బాధలు మాయం…