Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని పనులు చేయడం వల్ల అనుకూల ఫలితాలు ఉండే అవకాశం ఉంది. ప్రతిరోజూ ప్రతి వ్యక్తికి ఏదో ఒక రూపంలో సహకారం ఉంటుంది. అలాంటి విషయాలను ఆస్ట్రాలజీ తెలుపుతుంది. ఈ శాస్త్రం ప్రకారం 2023 అక్టోబర్ 14న శనివారం 12 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
చేపట్టిన కార్యక్రమాల్లో బంధువుల సహకారం ఉంటుంది. మంచి పనులు ప్రారంభిస్తారు. మానసిక ప్రశాంతతో కలిగి ఉంటారు. అనుకున్న పనులు నెరవేరుతాయి.
వృషభం:
శత్రువలపై విజయం సాధిస్తారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనోబలంతో ఉండాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంలో చికాకులు ఏర్పడచ్చు.
మిథునం:
ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. కాలాన్ని వృథా చేయకుండా మంచి పనులకు ఉపయోగించాలి. ఆయా రంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి.
కర్కాటకం:
విందు, వినోద కార్యక్రమాల్లోపాల్గొంటారు. ఫైనాన్స్ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ప్రారంభించిన కార్యక్రమాలు పూర్తవుతాయి. ప్రశాంతంగా ఉంటేనే పనులు పూర్తవుతాయి.
సింహం:
ఆశయాలు నెరవేరుతాయి. కొన్ని రంగాల వారికి లాభదాయకం. అనుకున్న పనులు పూర్తవుతాయి. దైవబలం కలిసివస్తుంది.
కన్య:
సమాజంలో గుర్తింపు వస్తుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. ధన లాభం ఉంటుంది. తోటివారితో సంతోషంగా గడుపుతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
తుల:
కొందరి ప్రవర్తన ఇబ్బందిని కలిగిస్తుంది. కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. కీలక నిర్ణయాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. తోటి వారి సలహాలు తీసుకోవాలి. కాలాన్ని వృథా చేయొద్దు.
వృశ్చికం:
ఒత్తిడిని దరి చేరనీయొద్దు. ముఖ్య వ్యవహారాల్లో ఓర్పుఅవసరం బంధువులతో జాగ్రత్తగా మెలగాలి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్తపడాలి.
ధనస్సు:
అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కీలక విషయాల్లో పెద్దలను కలుస్తారు. ఉద్యోగ, వ్యాపారులకు మంచి జరిగే అవకాశం.
మకరం:
గతం కంటే మంచి సమయం ప్రారంభమవుతుంది. స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాల్లోసత్ఫలితాలు ఉంటాయి. ప్లానింగ్ ప్రకారంగా ముందుకు వెళ్లాలి.
కుంభం:
వృత్తి, ఉద్యోగాల వారికి అనుకూల ఫలితాలు. మానసికంగా ధృఢంగా ఉంటారు. అధికార పరిధి పెరుగుతుంది.
మీనం:
ఒక శుభవార్త వింటారు. మనోధైర్యం పెరుగుతుంది. ఆయా రంగాల వారికి అనుకూల ఫలితాలు. మొహమాటం వల్ల ఖర్చులు పెరుగుతాయి.