Israel VS Hamas : రాకెట్లు, బాంబుల దాడులు: గాజా ఇక కాలగర్భంలోకేనా?

ఎమర్జెన్సీ సర్కారు ఏర్పాటుకు ఇజ్రాయెల్‌ సెనేట్‌ ఆమోదించింది. ఆ వెంటనే సర్కారు కొలువుదీరిన సంగతి తెలిసిందే.

Written By: NARESH, Updated On : October 13, 2023 9:36 pm
Follow us on

Israel VS Hamas : పాలస్తీనా మిలిటెంట్‌ గ్రూప్‌– హరాకత్‌ అల్‌-ముక్వామా అల్‌-ఇస్లామియా(హమాస్‌) పరిపాలిస్తున్న గాజా ఇప్పుడు ఇజ్రాయెల్‌ ముప్పేట దాడులతో దిక్కుతోచని స్థితిలో ఉంది. కరెంటు లేక కకావికలమవుతోంది. అన్నపానీయాలు దొరక్క ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఏ క్షణంలో ఎక్కడి నుంచి బాంబులు పడతాయోనని గజగజ వణుకుతున్నారు. విలువైన వస్తువులు, తట్టాబుట్ట సర్దుకుని.. ఐక్య రాజ్య సమితి(ఐరాస) శిబిరాలకు తరలుతున్నారు. హమా్‌స-ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం సందర్భంగా గాజాలో కనిపిస్తున్న దృశ్యాలివి..ఐదు రోజులుగా మూసి ఉన్న దుకాణాలు గురువారం ఉదయం కొంత సేపు తెరుచుకోగా.. ఆహార పదార్థాల కొనుగోలుకు జనాలు బారులు తీరారు. బేకరీలు, పచారీ కొట్ల వద్ద క్యూలు కట్టారు.

రాబోయే రోజుల్లో యుద్ధం తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని, ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సె్‌స్‌(ఐడీఎఫ్‌) గాజాలోకి చొచ్చుకువస్తుందనే వార్తలతో ప్రజలు ఆహార పదార్థాల నిల్వకు ప్రయత్నాలు చేయడం వంటి వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. పునరావాస కేంద్రం వద్ద తాకిడి విపరీతంగా ఉందని ఐరాస వర్గాలు వెల్లడించాయి. ఇజ్రాయెల్‌ దాడుల్లో 1,350 మంది పౌరులు చనిపోయారని, 3 లక్షల మంది నిరాశ్రయులయ్యారని పేర్కొన్నాయి. ఆరో రోజు ఇజ్రాయెల్‌ జరిపిన రాకెట్‌ దాడుల్లో హమాస్‌ కీలక నేత మూసా నాసిర్‌ హతమైనట్లు ఐడీఎఫ్‌ వర్గాలు వెల్లడించాయి. ‘‘మేము కేవలం గాజాలోని ఉగ్రవాద స్థావరాలనే టార్గెట్‌గా చేసుకున్నాం. పౌరుల ఇళ్లలోంచి ఉగ్రవాద నెట్‌వర్క్‌ ఉన్న టన్నెల్స్‌కు మార్గాలున్నాయి. అలాంటి వాటిని గుర్తించి, రాకెట్‌ దాడులు చేస్తు న్నాం. గాజాలోని ఆస్పత్రులను టార్గెట్‌ చేసుకోలేదు. కరెంటు లేకు న్నా.. ఆస్పత్రుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లున్నాయని గుర్తించాం. జనరేటర్లు పనిచేయడానికి ఇంధనం కావాలనే ఉద్దేశంతో.. గాజాలోని ఏ ఒక్క పెట్రోల్‌ బంకుపైనా దాడి చేయలేదు’’ అని ఐడీఎఫ్‌ వర్గాలు వివరించాయి. గురువారం ఒక్కరోజే గాజాపై 6 వేల రాకెట్లతో దాడులు చేశామని, 3,600 టార్గెట్లను ధ్వంసం చేశామని చెప్పాయి. హమాస్‌ దాడుల్లో మరణించిన పౌరుల వివరాలను గుర్తించి, వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని వెల్లడించాయి. పౌరుల బయోమెట్రిక్‌ డేటాబేస్‌ ప్రభు త్వం వద్ద ఉందని, ఆ డేటాబే్‌సతోపాటు.. డీఎన్‌ఏ ఆధారంగా మృతులను గుర్తిస్తున్నామని తెలిపాయి.

గ్రౌండ్‌ యాక్షన్‌కు సర్వం సిద్ధం
కొద్ది రోజులుగా సరిహద్దులు, సముద్రం నుంచి వైమానిక, శతఘ్ని దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌.. గాజా ముట్టడికి గ్రౌండ్‌ యాక్షన్‌కు దిగేందుకు సిద్ధమైంది. 3.6 లక్షల రిజర్వ్‌ బలగాల్లో సింహభాగాన్ని గాజాస్ట్రిప్‌ సరిహద్దుల్లో మోహరించింది. ప్రభుత్వ ఆదేశాలే తరువాయి అని.. ఆ వెంటనే రంగంలోకి దిగి, గాజాలోని ప్రతి ఇంటినీ జల్లెడపడుతామని ఐడీఎఫ్‌ పేర్కొంది. అ యితే.. మాయానగరం లాంటి గాజాలోని భూగర్భ సొరంగాల నెట్‌వర్క్‌ను ఛేదించడం, బందీల ను విడిపించడం అంత సులభమైన పని కాదని అమెరికా నిఘా సంస్థ సీఐఏ డైరెక్టర్‌ లియోన్‌ పనెట్ట పేర్కొన్నారు. మరోవైపు.. అమెరికా రక్షణ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ ఇజ్రాయెల్‌ చేరుకున్నారు. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుతో ఆయన భేటీ అయ్యారు. బ్లింకెన్‌ శుక్రవారం పాలస్తీనా అధ్యక్షుడు మొహమ్మద్‌ అబ్బాస్‌, జోర్దాన్‌ రాజు అబ్దుల్లా-2తో భేటీ అయ్యారు. మరోవైపు హమా్‌సతో చర్చలకు సిద్ధమని తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్‌ ప్రకటించారు. బందీలను విడిపించేందుకు తాము ప్రయత్నిస్తామని తెలిపారు. కాగా, ఇజ్రాయెల్‌పై దాడి చేసిన హమాస్‌ ఉగ్రవాద సంస్థను భూమ్మీద లేకుండా చేస్తామని నెతన్యాహు ప్రతినబూనారు. ఎమర్జెన్సీ సర్కారు ఏర్పాటుకు ఇజ్రాయెల్‌ సెనేట్‌ ఆమోదించింది. ఆ వెంటనే సర్కారు కొలువుదీరిన సంగతి తెలిసిందే.