Homeఆధ్యాత్మికంWant to go to Arunachalam: అరుణాచలం వెళ్లాలని అనుకుంటారా? తక్కువ ధరలో  Telangana Tourism...

Want to go to Arunachalam: అరుణాచలం వెళ్లాలని అనుకుంటారా? తక్కువ ధరలో  Telangana Tourism ప్రత్యేక ప్యాకేజీ వివరాలు ఇవే..

Want to go to Arunachalam: త్రిమూర్తుల్లో ఒకరైన మహాదేవుడి దర్శనం కోసం పరితపిస్తుంటారు. ఇందు కోసం భక్తులు  ప్రతి సోమవారం శైవలయాలను దర్శిస్తుంటారు. అయితే కార్తీక మాసంలో శివదర్శనం వల్ల మంచి ఫలితాలు ఉంటాయిన పండితులు చెబుతూ ఉంటారు. దీంతో ఈ నెలలో ఎక్కువ మంది శివాలయాలకు వెళ్తుంటారు. వీటిలో ప్రముఖ క్షేత్రాలను దర్శించుకోవాలని చూస్తుంటారు. దేశంలోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో అరుణాచంల ఒకటి. తమిళనాడులో కొలువై ఉన్న ఈ ఆలయంలో పరమ శివుడు భక్తులకు దర్శనం ఇచ్చి వారి కోరికలను నెరవేరుస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోని ఎక్కువ మంది తిరుమల శ్రీవారిని దర్శించుకునే క్రమంలో అరుణాచం క్షేత్రానికి కూడా వెళ్తున్నారు. అయితే కార్తీక మాసంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉండనుంది. ఈ నేపథ్యంలో Telangana Tourism అరుణాచలం వెళ్లాలనుకునేవారికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. ఆ వివరాల్లోకి వెళితే..

తమిళనాడులోని అరుణాచలం క్షేత్రం ప్రత్యేకమైనది. దీనినే అన్నామలై అని కూడా పిలుస్తారు. ఇక్కడికి తమిళనాడు, తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తలు దర్శనం చేసుకోవడానికి వస్తుంటారు. కార్తీక మాసంలో అరుణాచలం క్షేత్రానికి ఎక్కువగా భక్తుల తాకిడి ఉండనుంది. ఇక్కడ గిరి ప్రదక్షిణ కూడా ఉంటుంది. గిరి ప్రదక్షిణ చేయడం వల్ల కోరిన కొర్కెలు తీరుతాయని అంటారు. దీంతో భక్తులు ఎక్కువ తాకిడి ఉంటుంది. దీంతో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేకంగా సర్వీసులను నడపనుంది. ఇందులో భాగంగా తెలంగాణలోని హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా బస్సులను కేటాయించారు. టూరిజం శాఖ నుంచి ట్రిప్పు 5 రోజులు కొనసాగుతుంది. ఇక్కడికి వెళ్లాలనుకునే వారు టూరిజం శాఖను సంప్రదించాల్సి ఉంటుంది.
అశ్వయిజ మాసం తరువాత కార్తీక మాసం ప్రారంభం అవుతుంది. ఈ మాసంలో శివకేశవుల దర్శనంతో అనుకోని అదృష్టాలు ఉంటాయని కొందరు భావిస్తారు.  అయతే కార్తీక పౌర్ణమి ముందు రోజుల్లో ఎక్కువగా శైవ క్షేత్రాలను దర్శించుకుంటారు. ఇందులో భాగంగా అరుణాచలం క్షేత్రాన్ని దర్శించుకోవాలని అనుకునేవారు 4 రోజుల టూర్ ప్యాకేజీలో వెళ్లొచ్చు. తెలంగాణ టూరిజం శాఖ నుంచి నవంబర్ 13న హైదరాబాద్ నుంచి అరుణాచలంకు బస్సు బయలు దేరుతుంది. ఈరోజు సాయంత్రం 6.30 గంటలకు బస్సు ప్రారంభం అవుతుంది. మరునాడు ఉదయం 9 గంటలకు కాణిపాకంలో ఉంటారు. ఇక్కడి దర్శనం అయిన తరువాత మధ్యాహ్నం 3 గంటలకు అరుణాచలం చేరుకుంటారు. ఇక్కడ దర్శనం పూర్తయిన తరువాత రాత్రి అరుణాచలంలోనే బస చేస్తారు.
మరుసటి ఉదయం అల్పహారం చేసిన తరువాత శ్రీపురం గోల్డెన్ టెంపుల్ దర్శనం ఉంటుంది. సాయంత్రం 4 గంటల తరువాతి బస్సు తిరిగి హైదరాబాద్ కు బయలు దేరుతుంది. నాల్గో రోజు ఉదయం 5 గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటారు. ఈ ప్యాకేజీలో ప్రయాణం చేయాలని అనుకునే వారికి పెద్దలకు రూ.8,000, పిల్లలకు రూ.6,400గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు www.tourism.telangana.gov.in/tourismఅనే వెబ్ సైట్ లో సంప్రదించాలని తెలిపారు. దైవ దర్శనంతో పాటు కొన్ని రోజులు ఉల్లాసంగా ఉండాలని కోరుకునేవారికి ఈ ట్రిప్ అనుకూలంగా ఉండనుందని తెలిపారు.
S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Exit mobile version