vishwakarma jayanti 2024 : హిందూ మతంలో ఎన్నో ప్రత్యేకమైన పూజలు ఉన్నాయి. ప్రతి పూజను అందరూ భక్తిశ్రద్ధలతో చేస్తారు. ఎలాంటి సమస్యలు రాకుండా సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరూ పూజలు నిర్వహిస్తారు. అయితే హిందూ పండుగల్లో విశ్వకర్మ జయంతికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ పూజను ఇంట్లో చేయడం వల్ల అన్ని పాపాలు తొలగిపోయి.. సంతోషం వస్తుందని భక్తులు నమ్ముతారు. మరి ఈ పూజను ఇంట్లో ఎలా చేయాలి? ఎలా చేస్తే ఫలితం వస్తుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ప్రతి ఏడాది సెప్టెంబర్ 16న విశ్వకర్మ జయంతిని జరుపుకుంటారు. విశ్వకర్మ జయంతిని ఎక్కువగా చేతివృత్తుల వాళ్లు లేదా యంత్రాల్లో పనిచేసే వాళ్లు ఎక్కువగా జరుపుకుంటారు. భాద్రపద మాసంలో సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ విశ్వకర్మ జయంతిని జరుపుకుంటారని పండితులు చెబుతున్నారు. విశ్వకర్మ బ్రహ్మ ఏడో కుమారుడు అని పురాణాల ప్రకారం చెబుతుంటారు. ఎక్కువగా పూజలు చేసే వస్తువులు, నిర్మాణ యంత్రాలు, కర్మాగారాలు, దుకాణాలు వంటివి ఉన్నవాళ్లు పూజిస్తారు. విశ్వకర్మను పూజించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందుతారని మన పండితులు అంటున్నారు. అయితే ఈ ఏడాది విశ్వకర్మ జయంతిని సెప్టెంబర్ 16వ తేదీ రాత్రి 7:47 నుంచి సెప్టెంబర్ 17వ తేదీ మంగళవారం రాత్రి 7:53 వరకు జరుపుకుంటారు. ముఖ్యంగా ఈరోజు పూజ చేసుకోవడానికి ఉదయం 11:08 నుంచి 1:43 వరకు ఉన్న శుభ సమయంలో పూజిస్తారు. భక్తి శ్రద్ధలతో ఈరోజు విశ్వకర్మను పూజించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగుతాయి. అలాగే ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్న వెంటనే తీరిపోతాయి. సుఖ శాంతులు ఇంట్లో వర్థిల్లుతాయి.
విశ్వకర్మ పూజను చాలా భక్తితో చేయాలి. ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి. శుభ్రమైన దుస్తులు ధరించి పూజను మొదలుపెట్టాలి. ఇంటి దగ్గర విశ్వకర్మ పటాన్ని ఉంచి.. దానికి పూల దండలు వేయాలి. ఆ తర్వాత ఒక కలశంలో బియ్యం వేసి పెట్టాలి. అలాగే పండ్లు, గంధం, తమలపాకు, పసుపు వంటివి విశ్వకర్మకి నైవేద్యంగా పెట్టాలి. ఇలా భక్తితో చేస్తే ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్న వెంటనే తీరిపోతాయని నమ్ముతారు. ఆర్థికంగా ఇబ్బంది పడేవాళ్లకు విశ్వకర్మ పూజ బాగా ఫలితం ఇస్తుందని నమ్ముతారు. ముఖ్యంగా వ్యాపారులకు లాభం చేకూరుతుంది. అయితే పరిశ్రమలు ఉన్నవాళ్లు తప్పకుండా ఈ పూజ నిర్వహించాలి. పూజ చేసేటప్పుడు కూడా కొన్ని నియమాలు పాటించాలి. లేకపోతే వ్యాపారాల్లో నష్టాలు చూడాల్సి వస్తుంది. ఈరోజు పూజ చేసిన వస్తువులను దానం చేయకూడదు. అలాగే మద్యం, ధూమపానం వంటి వాటికి దూరంగా ఉండాలి. మీ ఇంట్లో ఏదైనా వాహనం ఉంటే తప్పకుండా పూజించాలి. వీటిని పూజించే ముందు సరిగ్గా శుభ్రం చేసుకోవాలి. ఈ తర్వాతే పూజించాలి. అప్పుడే ఎలాంటి సమస్యలు రాకుండా సంతోషంగా ఉంటారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు పండితుల సలహాలు తీసుకోవాలి. ఈ సమాచారాన్ని గూగుల్ ఆధారంగా చెప్పాము..