Pushpa 2: పుష్ప 2 లో బన్నీ విశ్వరూపం చూపించబోతున్నాడా..? ఆయన ఖాతాలో మరో నేషనల్ అవార్డు పక్కానా..?

సినిమా అనేది చూసే ప్రేక్షకుడికి చాలా బాగా నచ్చాలి. లేకపోతే మాత్రం ప్రేక్షకులు ఆ సినిమాను చూడడానికి గాని, ఆ సినిమా గురించి డిస్కస్ చేయడానికి గాని పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించరు...

Written By: Gopi, Updated On : September 17, 2024 12:28 pm

Pushpa 2

Follow us on

Pushpa 2: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి ఇక్కడ కొంతమందికి మాత్రమే చాలా మంచి గుర్తింపు అయితే దక్కుతుంది. ఇక అందులో భాగంగానే స్టైలిష్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకొని పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన చేసిన సినిమాలు ఆయనను చాలా ఉత్తమమైన స్థాయిలో నిలబెట్టాయి. ఇక ఇప్పటికే ఆయన పుష్ప సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోకి సాధ్యం కానీ రీతిలో నేషనల్ అవార్డు ని దక్కించుకొని ప్రతి ఒక్క తెలుగు అభిమాని చాలా గర్వం గా చెప్పుకునేలా చేశాడు. ఇక ఆయన చేసిన పుష్ప సినిమా భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమాకి గుర్తింపు దక్కడమే కాకుండా అక్కడ భారీ సక్సెస్ ని సాధించింది. ఇక దాంతో అల్లు అర్జున్ స్టార్ డమ్ కూడా ఒక్కసారిగా ఇండియా వైడ్ గా పెరిగిపోయిందనే చెప్పాలి.

మరి ఇప్పుడు వస్తున్న ‘పుష్ప 2’ సినిమాతో కూడా మరోసారి ఆయన నట విశ్వరూపాన్ని చూపించడానికి సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాలో కొన్ని కీలకమైన సన్నివేశాల్లో అల్లు అర్జున్ తన నట విశ్వరూపాన్ని చూపించి ప్రేక్షకులను ఆశ్చర్య పరచబోతున్నాడనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ కనక మరోసారి తన నటనతో మంచి గుర్తింపును సంపాదిస్తే ఫ్యూచర్ లో ఆయన మరింత స్టార్ డమ్ ను విస్తరించుకునే అవకాశాలైతే ఉన్నాయి.

ఇక ఇప్పటికే ఈ సినిమాలో ‘గంగాలమ్మ జాతర’ తో పాటు క్లైమాక్స్ ఎపిసోడ్లో కూడా అల్లు అర్జున్ తన నటనతో ప్రేక్షకులందరి మైమరిపింప చేస్తాడు అంటూ ఇప్పటికే ఈ సినిమా దర్శకుడు అయిన సుకుమార్ చాలా స్పష్టంగా చెబుతున్నాడు. మరి ఆయన అంత కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు అంటే అల్లు అర్జున్ ఆ సీన్స్ లో తన నటన ప్రావీణ్యాన్ని ఏ రేంజ్ లో చూపించి ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఇప్పటికే ఈ సినిమాతో వెయ్యి కోట్ల కలెక్షన్లు రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.

మరి అన్ని అనుకున్నట్టు జరిగితే పుష్ప 2 సినిమా డిసెంబర్ 6వ తేదీన వచ్చి ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను తుడిచిపెట్టబోతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో ఈ సినిమా మీద భారీ చర్చలు అయితే జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాతో అల్లు అర్జున్ మరోసారి నేషనల్ కూడా గెలుచుకుంటాడు అంటూ మరి కొంతమంది అల్లు అర్జున్ డై హార్ట్ ఫ్యాన్స్ చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు…