Narendra Modi Birthday: భారతీయ జనతా పార్టీలో వివిధ పదవులను నరేంద్ర మోడీ నిర్వహించారు. ఆ తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎదిగారు. సుదీర్ఘకాలం గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత భారతదేశానికి 2014లో ప్రధానమంత్రి అయ్యారు. 2019, 2024 ఎన్నికల్లోనూ ప్రధానమంత్రి పీఠాన్ని నరేంద్ర మోడీ అధిరోహించారు. తద్వారా హ్యాట్రిక్ సాధించారు. రాజకీయంగా నరేంద్ర మోడీకి క్లీన్ ఇమేజ్ ఉంది. అనేక పోరాటాల అనంతరం ఆయన ఈ అత్యున్నత స్థానానికి చేరుకున్నారు.. నరేంద్ర మోడీ తనను తాను చావాలా అని పిలుచుకుంటారు. ఎన్నో కష్టాలను తన జీవితంలో ఎదుర్కొన్నారు. మొదట రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో ఆయన పని చేశారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరారు. అనేక పదవులను అధిరోహించిన తర్వాత దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఇటీవలి పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన అఫిడవిట్ లో ఆస్తుల వివరాలను వెల్లడించారు. తన సంపదను 3.2 కోట్లుగా ప్రకటించారు. స్థిర, చర ఆస్తులు కలిపి మోడీ ఈ వివరాలు ప్రకటించారు. 2019, 2014 సంవత్సరాల కంటే మోడీ సంపాదన పెరిగింది. 2014లో మోడీ సంపద 1.66 కోట్లు, 2019లో 2.51 కోట్ల ఆస్తులను మోడీ ప్రకటించారు.
అధికంగా బంగారం
మోడీ వద్ద 2.67 లక్షల విలువైన స్వర్ణం ఉంది ఉంది.. ఆ బంగారంతో ఆయన నాలుగు ఉంగరాలు చేయించుకున్నారు. నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ లో 9.12 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు. NSC లో ఈ పెట్టుబడి 2019లో 7.61 లక్షలు గా ఉన్నది. ఇప్పుడు అది 9.61 లక్షలకు పెరిగింది. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎటువంటి భూమి లేదు. షేర్లు కూడా లేవు. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి కూడా పెట్టలేదు. ఆయన వద్ద 52, 920 రూపాయల నగదు ఉంది. నరేంద్ర మోడీ జశోద బెన్ ను తన భార్యగా పేర్కొన్నారు. గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి ఆయన ఎంఏ పట్టా పొందారు. 1978లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి పట్టభద్రుడయ్యారు. 1967లో గుజరాత్ బోర్డు ద్వారా ఎస్ఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యారు. ఆయనపై ఎటువంటి క్రిమినల్ కేసులు లేవు. ప్రభుత్వ రుణాలు కూడా లేవు.
మోడీ ఏం సాధించారంటే..
మోడీ హయాంలో ట్రిబుల్ తలాక్ రద్దు చేశారు. ఆర్టికల్ 370 ని చరిత్రపుటల్లోకి పంపించారు. జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి స్వేచ్ఛ వాయువులు అందించారు. పెద్ద నోట్లను రద్దు చేశారు. ఇదే సమయంలో అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం చేశారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే బిల్లును ఆమోదించారు. జీఎస్టీ ని తెరపైకి తెచ్చారు. సాగు చట్టాల విషయంలో వెనక్కి తగ్గారు.. అగ్నిపథ్ స్కీం విషయంలోనూ కొంతమేర ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే మోడీ తన రెండు పర్యాయాల పదవి కాలంలో అనేక మార్పులు తీసుకొచ్చారని చెప్పొచ్చు.