Vastu Tips: హిందువులు ఎక్కువగా వాస్తు నియమాలను పాటిస్తారు. నిజానికి వీరు ఇంటిని నిర్మించుకున్నప్పుడే వాస్తు నియమాల బట్టి నిర్మించుకుంటారు. ఇంట్లో దేవుడు గది ఎక్కడ ఉండాలి, పడక గది, బాత్రూమ్ ఎక్కడ ఉండాలనే అన్ని విషయాలను కూడా ముందుగానే ప్లాన్ చేసి నిర్మించుకుంటారు. అయితే హిందు శాస్త్రంలో వాస్తుకి ఓ ప్రత్యేకత ఉంది. వాస్తు నియమాలను తప్పకుండా పాటిస్తారు. ఒక వేళ పాటించకపోతే ఇంట్లో ఆర్థిక సమస్యలు వంటివి వస్తాయని అంటుంటారు. ఇంట్లో కొన్ని వస్తువులను కొన్ని ప్రదేశాల్లో మాత్రమే ఉంచాలి. వేరే ప్రదేశాల్లో ఉంచడం వల్ల తప్పకుండా ఇంట్లో సమస్యలు వస్తాయని మన పండితులు కూడా చెబుతుంటారు. అయితే కొందరు ఇంట్లో వస్తువులను ఉంచాల్సిన ప్రదేశాల్లో కాకుండా వ్యతిరేక ప్రదేశాల్లో ఉంచుతుంటారు. దీనివల్ల కొందరు జీవితంలో చాలా నష్టాలని చవి చూడాల్సి వస్తుందని అంటున్నారు. అయితే ఇంట్లో కొన్ని వస్తువులను ఉంచాల్సిన ప్రదేశంలో మాత్రమే ఉంచాలి. మరి ఇంట్లో ఎక్కడ ఏ వస్తువులను ఉంచాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఎలక్ట్రానిక్ వస్తువులను ఉత్తరం వైపు ఉంచవద్దు
కొందరు ఎలక్ట్రానిక్ వస్తువులను ఉత్తరం వైపు ఉంచుతుంటారు. ఉదాహరణకు టీవీ, ఫ్రిడ్జ్, కంప్యూటర్ వంటి వస్తువులను ఇంట్లో ఉత్తరం లేదా ఈశాన్య దిశలో అసలు ఉంచకూడదని పండితులు చెబుతున్నారు. ఈ మూలలో ఉంచితే ఇంట్లో ఎల్లప్పుడూ కూడా ఆర్థిక సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఉత్తర దిశకు అధిపతి కుబేరుడు. ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు కుబేర దేవుడికి చెందవు. కాబట్టి మీరు ఆ దిశలో పెడితే ప్రయోజనాలు కంటే నష్టాలనే ఎక్కువగా చూస్తారు.
చెత్తను అసలు ఈ దిశలో ఉంచవద్దు
కొందరు డస్ట్ బిన్‌ను ఉత్తరం వైపు ఉంచుతారు. ఉత్తరం వైపు చెత్త డబ్బాను ఉంచడం వల్ల ఎంత కోటీశ్వరులు అయిన కూడా పేదవారిగా మారిపోతారట. అలాగే చెత్త ఉంచే ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని పండితులు అంటున్నారు. చెత్త ప్లేస్ అని ఎలా పడితే అలా పెట్టడం వల్ల ఇంట్లో ఆర్థిక నష్టాలు తప్పవు.
నల్లని వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో ఉత్తరం వైపు ఉంచవద్దు
నలుపు రంగు వస్తువులను అసలు ఉత్తర వైపున ఉంచకూడదు. అలాగే ఉత్తరం వైపు ఉన్న కిటికీ లేదా తలుపులకు కూడా నలుపు రంగు కర్టెన్లు, నల్ల వస్తువులు ఉండకుండా చూసుకోండి. ఉత్తర దిశలో ఇలా నల్ల వస్తువులను పెట్టడం వల్ల ఇంట్లో శారీరక సమస్యలతో పాటు మానసిక సమస్యలు వస్తాయి. ఎల్లప్పుడూ కూడా కటిక దరిద్రంలో జీవిస్తారట.
విరిగిన వస్తువులు
విరిగిన, పాత వస్తువులను ఉత్తర దిశలో ఉంచకూడదు. వీటివల్ల ఇంట్లో సంపద ఉండదు. ఎక్కువగా ఆర్థికంగా ఇబ్బంది పడతారు. అలాగే సోఫా, బెడ్ వంటివి కూడా ఉత్తర దిశలో వేయకూడదు. దీనివల్ల ఎక్కువగా నష్టపోతారని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ తప్పులు చేయవద్దు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలన్నీ కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. సూచనలు, సలహాల కోసం పండితులను సంప్రదించగలరు.