Kalki2898AD Movie: గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన రెబెల్ స్టార్ ప్రభాస్ కల్కి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన వసూళ్ల సునామీని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. మహాభారతం కి సైన్స్ ఫిక్షన్ ని జోడించి తీసిన ఈ సినిమాకి మన ఇండియన్ ఆడియన్స్ వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను అందించారు. ఓటీటీ లో కూడా ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాపై తీవ్రమైన విమర్శలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే కర్ణుడిని హీరో గా చూపించి, అర్జునుడు అతని ముందు గడ్డిపూస తో సమానం అన్నట్టుగా డైరెక్టర్ నాగవంశీ చూపించడమే. వ్యాస మహర్షి రాసిన మహాభారతం ప్రకారం కర్ణుడు విలన్. అసలు ద్రౌపది కి నిండు సభలో అంతటి అవమానం చేయమని దుర్యోధనుడికి సలహా ఇచ్చిందే కర్ణుడు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈ సినిమా వాళ్ళందరూ మహానుభావుడి లెక్క చూపిస్తున్నారు అంటూ హిందూ మాత ప్రచారకర్తలు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసారు.
అయితే ఇప్పుడు ఆ లిస్ట్ లోకి ప్రముఖ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ కూడా చేరిపోయాడు. రీసెంట్ గా ఆయన ఈ చిత్రం గురించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘సినిమాల్లో హైందవ ధర్మం పై మూడు కోణాల్లో దాడి జరుగుతుంది. తెరపై వినోదం కోసం హైందవ ధర్మానికి సంబంధించిన పురాణాలను వక్రీకరించి చూపిస్తున్నారు. కల్కి చిత్రం లో కర్ణుడి పాత్రకు అనవసరమైన గొప్పతనం ఇచ్చి చూపించినందుకు ఒక సినిమా పరిశ్రమకి చెందిన వ్యక్తిగా సిగ్గుపడుతున్నాను. ఈ విషయాన్నీ నేను బెజవాడ గడ్డ మీద నిల్చొని నిర్మొహమాటంగా చెప్తున్నాను. నాకు ఆ సినిమా దర్శక నిర్మాతలు భవిష్యత్తులో అవకాశాలు ఇవ్వకపోయినా పర్వాలేదు. అప్పటి దర్శకులు అయినా, ఇప్పటి దర్శకులు గురించి అయిన వాళ్ళు హైందవ ధర్మాన్ని వక్రీకరించి చూపిన విధానం గురించి నిలదీయకపోతే, హిందువుగా పుట్టి నేను వ్యర్థం’ అంటూ ఆయన ఈ సందర్భంగా బావోద్వేగంగా మాట్లాడాడు.
వ్యాస మహర్షి మహాభారతం ప్రకారం కర్ణుడు మహా వీరుడు, సూరుడే.. కానీ అర్జునుడిని మించిన వీరుడు మాత్రం కాదు. అదే విధంగా ఆయన పూర్తిగా మంచివాడు కాదు, అలాగని పూర్తిగా చెడ్డవాడు కూడా కాదు. కానీ అతను ఒక మహా అహంకారి, తనని తాను అందరికంటే గొప్ప అని చూపించుకోవడానికే ఎంతకైనా తెగిస్తాడు. తనని అవమానించిన వారిపై ఎలా పగ తీర్చుకోవాలని ప్రతీకార జ్వాలాతో రగిలిపోతుంటాడు. ఆ అహంకారమే అతన్ని దుర్యోధనుడి వైపు నిలిచేలా చేసింది. ఆ అహంకారం వల్లే సొంత తమ్ముడైన అర్జునుడి చేతిలో హతమారాల్సి వచ్చింది. వ్యాస మహర్షి రాసిన ఈ మహాభారతం ని ఎవరైతే వెండితెర మీద తూచా తప్పకుండా చూపిస్తారో వాళ్ళు ధన్యులు, కానీ వినోదం కోసం, కర్ణుడి పాత్ర నుండి వచ్చే ఎమోషనల్ సన్నివేశాల కోసం వ్యాస భారతాన్ని ఏ ఫిల్మ్ మేకర్ కూడా పరిగణలోకి తీసుకోడు.