Vasantha Panchami 2025: హిందూ శాస్త్ర ప్రకారం కొన్ని పండుగలు, పర్వదినాలు మాత్రమే కాకుండా ప్రత్యేక రోజుల్లో కూడా పూజలు, వ్రతాలు చేస్తూ ఉంటారు. ఆ రోజుల్లో పూజలు చేయడం వల్ల ఆధ్యాత్మికంగా ప్రశాంత వాతావరణంగా ఉండటమే కాకుండా జీవితంలో అనుకున్న పనులు నెరవేరుతాయని చాలామంది భక్తులు నమ్ముతారు. సాధారణంగా ప్రతి విద్యార్థి తన భవిష్యత్తు బాగుండాలని మొదట పూజించేది సరస్వతీ మాతనే. సరస్వతి మాత కు ఆలయాలు తక్కువే ఉన్నాయి. కానీ ప్రతి ఏడాది సరస్వతి మాత కోసం ఒక రోజు వస్తుంది. అదే వసంత పంచమి. ఫిబ్రవరి నెలలో లేదా మాఘమాసంలో వచ్చే వసంత పంచమిని తెలుగు రాష్ట్రాలు ప్రత్యేక పర్వదినంగా భావిస్తారు. అయితే 2025 ఏడాదిలో వసంత పంచమి ఎప్పుడు..) అనే అయోమయంలో ఉన్నారు ఇంతకీ అసలైన వసంత పంచమి ఎప్పుడంటే..?
ప్రతి వ్యక్తి తన జీవితంలో మొట్టమొదటి సారి పూజించే దేవత సరస్వతి మాతనే. పాఠశాలల్లో సరస్వతి పూజ నిర్వహించిన తర్వాతే తరగతులు ప్రారంభం అవుతాయి. అలాంటి దేవికి వసంత పంచమి రోజున పాఠశాలల్లో విద్యాసంస్థల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. సరస్వతి మాతను కొలవడం వల్ల ఆ దేవి అనుగ్రహంతో విద్యారంగంలో రాణిస్తారని చాలామంది భక్తుల నమ్మకం. ఈరోజు పిల్లలకు అక్షరాభ్యాసం ఎక్కువగా నిర్వహిస్తారు. అలాగే కొత్తగా పాఠశాలలో చేరేవారు సైతం ఇదే రోజున జాయిన్ చేస్తారు. విద్యార్థులు మాత్రమే కాకుండా ప్రజలు సైతం వసంత పంచమి రోజున సరస్వతి దేవిని పూజించడం వల్ల అన్ని శుభాలే కలుగుతాయని నమ్ముతారు.
ప్రతి మాఘమాసంలో వచ్చే వసంత పంచమి 2025లో ఫిబ్రవరి నెలలో వసంత పంచమిని నిర్వహించుకోవాలని కొందరు పండితులు చెప్పారు. అయితే ఫిబ్రవరి 2 లేదా ఫిబ్రవరి 3 అని కొందరు చెబుతున్నారు. పంచాంగం ప్రకారం ఫిబ్రవరి 2 ఆదివారం ఉదయం 9.45 గంటల వరకు చవితి తిథి ఉంది. అయితే 9:45 గంటల నుంచి మధ్యాహ్నం 12 35 గంటల వరకు పూజలు నిర్వహించుకోవాలని పండితులు చెబుతున్నారు. ఫిబ్రవరి 3 ఆదివారం ఉదయం 6:50 నుంచి 6 52 గంటల వరకు చవితి తిధి ఉంది. ఈ రెండు నిమిషాల్లోనే పూజలు నిర్వహించుకోవడం సాధ్యం కాదు. అందువల్ల ఫిబ్రవరి రెండునె వసంత పంచమిని నిర్వహించుకోవాలని చెబుతున్నారు.
వసంత పంచమి రోజున ఇంట్లో పూజ చేసే వాళ్ళు కొన్ని నియమాలు పాటించాలి. సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం చేసి పసుపు లేదా తెలుపు బట్టలను ధరించాలి. ఇంట్లో అమ్మవారిని ప్రతిష్టించి పసుపు రంగు దుస్తులను సమర్పించాలి. పసుపు రంగులో ఉండే పూలతో పూజ చేయాలి. ఒకవేళ నైవేద్యం పెట్టాలని అనుకుంటే ఇవి కూడా పసుపు రంగులో ఉండే విధంగా చూసుకోవాలి. పూజా సమయంలో సరస్వతి మంత్రాన్ని పఠించాలి. వసంత పంచమి రోజున పూజలు నిర్వహించడం వల్ల వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందని భావిస్తారు. అలాగే సంతానం కావాలనుకునేవారు సరస్వతీ మాత అనుగ్రహం ఉండాలని కొందరు చెబుతుంటారు.