Today 1 February 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై పుష్య నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో ఐదు రాశుల వారికి సూర్య దేవుడి ఆశీస్సులు ఉండడంతో అనేక ఆర్థిక ప్రయోజనాలు పొందనున్నారు. మిగతా రాశుల వారు కష్టాల నుంచి బయటపడతారు. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు జీవిత భాగస్వామితో ఈరోజు దూర ప్రయాణాలు చేస్తారు. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారాలు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దలను సంప్రదించడం మంచిది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కొత్త వాహనాలు కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈరోజు ఏ పని మొదలుపెట్టినా దానిని వెంటనే పూర్తి చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యాపారులు చేసే పనులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. బంధువుల నుంచి ధన సహాయం అందుతుంది. పెట్టుబడులు పెట్టేముందు ఆలోచించాలి. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. గతంలో చేపట్టిన కొన్ని పనులు ఈరోజు పూర్తయ్యే అవకాశం ఉంది. విద్యార్థుల పోటీ పరీక్షలకు గురువుల మద్దతు ఉంటుంది. వ్యాపారులకు మెరుగైన లాభాలు రానున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారి కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. దీంతో కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈరోజు సమాజంలో గుర్తింపు ఉంటుంది. కొన్ని ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగులకు సీనియర్ల నుంచి మద్దతు ఉంటుంది. దీంతో ప్రాజెక్టులను అనుకున్న సమయంలో పూర్తి చేయగలుగుతారు. మాటతీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఊహించని విధంగా ఖర్చులు పెరుగుతాయి. అందువల్ల వస్తువులు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎవరితోనో అనవసరపు వాదనలకు దిగకుండా ఉండాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ముఖ్యమైన శుభకార్యంలో పాల్గొంటారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. తీర్థయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారి కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. గతంలో కంటే ఇప్పుడు ఆదాయం మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. స్నేహితుల నుంచి ధన సహాయమందుతుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. కొత్తగా అప్పులు చేయకుండా ఉండడమే మంచిది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని సానుకూల ఫలితాలు ఉంటాయి. స్నేహితుల నుంచి ధన సహాయం. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బ్యాంకు నుంచి కొత్త రుణం తీసుకుంటారు. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత ఉంచాలి. స్నేహితుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఉన్నతాధికారుల నుంచి ప్రయోజనాలు పొందుతారు. ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారులు కొత్త భాగస్వాములను చేర్చుకుంటారు. వీరితో లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతారు. పెద్దల సలహా తీసుకోవడం మంచిది. నాణ్యమైన సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు విదేశీ సంబంధిత కార్యకలాపాలను జరుపుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వీరికి గురువుల మద్దతు ఉంటుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సమస్యలు తొలగిపోవడంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.