Union Budget 2025 : కారు కొనడం అనేది ప్రతి ఒక్కరి కల. మీరు కొత్త కారు కొన్నప్పుడల్లా అనేక విధాలుగా పన్ను చెల్లించాలి. ఇది మాత్రమే కాదు.. మీ నుండి అనేక రకాల రుసుములు కూడా వసూలు చేయడం జరుగుతుంది. ఇవి వివిధ రాష్ట్రాల ప్రకారం మారుతూ ఉంటాయి. ఈరోజు మనం కారు కొనే సమయంలో ప్రభుత్వానికి పరోక్షంగా ఎంత పన్ను చెల్లిస్తామో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
కారుపై ఎంత పన్ను విధించబడుతుంది?
ముందుగా ఎక్స్-షోరూమ్ ధర గురించి మాట్లాడుకుందాం… ఇది కార్ల తయారీ సంస్థ నుండి డీలర్‌కు చేరే ధర. ఎక్స్-షోరూమ్ ధరలో కారు ఖర్చు, డీలర్ కమిషన్ కలిసి ఉంటాయి. రెండవది, మీరు కారు కొనడానికి రోడ్డు పన్ను కూడా చెల్లించాలి, ఇది రాష్ట్రం నుండి రాష్ట్రానికి మారుతుంది. మూడవది, కారుపై రిజిస్ట్రేషన్ రుసుము విధించబడుతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం, కారు టైపు, ఇంజిన్ సామర్థ్యాన్ని బట్టి మారుతుంది.
ఇది కాకుండా, కారుపై మోటారు వాహన పన్ను కూడా విధించబడుతుంది. కేంద్ర ప్రభుత్వం కారుపై ఎక్స్-షోరూమ్ ధర, ఇతర ఛార్జీలపై 18 శాతం లేదా 28 శాతం వరకు GST విధిస్తుంది. ఇది పూర్తిగా కారు మోడల్ మీద ఆధారపడి ఉంటుంది.
దీన్ని ఉదాహరణగా తీసుకోండి
కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పార్కింగ్ ఛార్జీలు, పర్యావరణ ఛార్జీలు వంటి అదనపు ఛార్జీలను కూడా విధించవచ్చు. ఉదాహరణకు, మీరు మారుతి గ్రాండ్ విటారా కారును కొనుగోలు చేస్తే, ఈ SUV ఒక వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10 లక్షల 61 వేల 379. ఈ ధరపై 28శాతం GST వసూలు చేస్తే, రూ. 2 లక్షల 97 వేల 186 అదనం. ఇది కాకుండా, కారుపై 17 శాతం సెస్సు కూడా విధించబడుతుంది, ఇది రూ. 1 లక్ష 80 వేల 434. ఇది కాకుండా, దానిపై రూ. 15389 అదనంగా వసూలు చేస్తారు. అంటే, రూ.10 లక్షల 61 వేల 379 విలువైన కారుపై ప్రభుత్వానికి పన్నుగా రూ.4 లక్షల 93 వేలు చెల్లించాల్సి వస్తుంది.