‘Today horoscope in telugu ‘: గ్రహాల మార్పుతో కొన్ని రాశులపై ప్రభావం ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశరాసులపై రోహిణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో రవి యోగం ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఆర్థికంగా ప్రయోజనాలు ఉండలు ఉన్నాయి. మరికొన్ని రాశుల వారు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ముఖ్యమైన పనుల కారణంగా బిజీగా ఉంటారు. విదేశాల్లో ఉండే వారి నుంచి శుభవార్తలు వింటారు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగులకు అనుకొని అదృష్టం వరిస్తుంది.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) ఒకరు ఇంటికి రావడం వల్ల ఇంట్లో సంతోషం గా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. వ్యాపారులు చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. ఆర్థికంగా పుంజుకుంటారు. జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు. ఆశ్చర్యకరమైన వార్తలు వింటారు. విద్యార్థులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు పొందుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : అనారోగ్యం కారణంగా ఇబ్బందులు పడతారు. విహారయాత్రలకు వెళ్లడానికి ప్లాన్ చేస్తారు. ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఖర్చులు పెట్టాలి. దానధర్మాలు చేయడం వల్ల ప్రశాంతంగా ఉంటారు. విద్యార్థులు కెరీర్ కి సంబంధించి శుభవార్త వింటారు. విదేశాల్లో ఉండేవారి నుంచి ఓ సమాచారం అందుకుంటారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఏ పని చేపట్టిన వెంటనే పూర్తి చేయాలి. నిర్లక్ష్యం చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు. ఇంటికి సంబంధించి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్త పనిని ప్రారంభించే ముందు పెద్దల సలహా తీసుకోవాలి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని కొత్త పెట్టుబడులు పెడతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. స్నేహితుల నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. మందులనుంచి తన సహాయం అందుతుంది. కొన్ని వర్గాల వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దీంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఆ ప్రాజెక్టు విషయంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటారు. వ్యాపారాలు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యర్థులను తెలివితేటలతో ఓడించాలి. తల్లిదండ్రుల మద్దతుతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసేవారు ఊహించని లాభాలు పొందుతారు. శత్రులతో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారులకు కుటుంబ సభ్యులు అండగా నిలుస్తారు. కొత్త ప్రణాళికల విషయం మై భాగస్వాములతో చర్చిస్తారు. ఏ పని చేపట్టినా పూర్తి చేసే వరకు శ్రమించాలి. విద్యార్థుల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు.
ధనస్సు రాశి( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : వ్యాపారాలు ఊహించని లాభాలు పొందుతారు. కొత్త వ్యక్తులతో సమాచారాన్ని పంచుకోకండి. పెండింగ్ బకాయలు వసూలు అవుతాయి. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. వాహనాలపై ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి. విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : మకర రాశి వారికి ఊహించని లాభాలు ఉంటాయి. ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తారు. తల్లిదండ్రుల వైపు నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. విద్యార్థులు ఆరోగ్యం పై జాగ్రత్తగా ఉండాలి. వైద్యులను సంప్రదించే విషయంలో నిర్లక్ష్యంగా ఉండద్దు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్తారు. వ్యాపారులకు అనుకొని అదృష్టం వరిస్తుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారు పెద్దల సలహా తీసుకోవాలి. కొత్త వ్యక్తులతో వ్యాపారాలు జాగ్రత్తగా ఉండాలి. పాత స్నేహితులను కలుస్తారు. అదనంగా ఖర్చులు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : కొందరు ఈ రాశి వ్యాపారుల పనులకు ఆటంకాలు కలిగించవచ్చు. అందువల్ల ముఖ్యమైన సమాచారాన్ని ఇతరులకు చెప్పవద్దు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తారు. ఎవరైనా అప్పు అడుగుతా ఇవ్వకుండా ఉండడమే మంచిది.