India vs England : 3 వన్డేల సిరీస్ లో భాగంగా నాగ్ పూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ జట్టును మట్టి కరిపించింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసింది. ప్రారంభంలో దూకుడుగా ఆడినప్పటికీ.. ఆ తర్వాత వెంటవెంటనే ఇంగ్లాండ్ జట్టు వికెట్లను కోల్పోయింది. ఫలితంగా 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆల్ అవుట్ అయింది. బట్లర్ 52, బెతల్ 51 పరుగులు చేసినప్పటికీ ఇంగ్లాండ్ జట్టు భారీ స్కోరు చేయలేకపోయింది. మిగతా ఆటగాళ్లు ఇవ్వడం కావడంతో ఇంగ్లాండ్ జట్టు భారీ స్కోర్ చేయలేకపోయింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా చెరి మూడు వికెట్లు పడగొట్టారు. ఎన్నో అంచనాలతో మైదానంలోకి వచ్చిన మహమ్మద్ షమీ ఒక్క వికెట్ మాత్రమే సాధించాడు. అక్షర్ పటేల్, కులదీప్ యాదవ్ చెరి ఒక వికెట్ తో సరిపుచ్చుకున్నారు. అనంతరం లక్ష్య చేదనకు దిగిన భారత జట్టు 38.4 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 251 పరుగులు చేసి.. సులభమైన గెలుపును అందుకుంది. గిల్ 87, అక్షర్ పటేల్ 52, అయ్యర్ 59 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో సఖీబ్ మహమ్మద్ , ఆదిల్ రషీద్ రెండేసి వికెట్లు పడగొట్టారు. జోప్రా ఆర్చర్, బెతల్ తలా ఒక వికెట్ సాధించారు. అయితే ఇంగ్లాండ్ విధించిన టార్గెట్ ను చేజ్ చేసే క్రమంలో టీమిండియా 19 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయింది. గిల్, శ్రేయస్ అయ్యర్ మూడో వికెట్ కు 94 పరుగులు జోడించి అదరగొట్టారు.
అందువల్లే ఓడిపోయాం
ఈ మ్యాచ్ లో వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఓడిపోయామని ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ అన్నాడు. ఈ ఓటమి తీవ్రంగా నిరాశపరిచిందన్నారు..” పవర్ ప్లే లో మాకు మెరుగైన ఆరంభం లభించింది. అయితే దానిని తదుపరి స్థాయికి తీసుకెళ్లడంలో మేము విఫలమయ్యాం. వరుసగా నాలుగు వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోరు చేయలేకపోయాం. ఇంకో 50 పరుగులు చేసి ఉంటే ఫలితాన్ని వేరే విధంగా ఊహించి ఉండేవాళ్లం. మా తప్పులు యధావిధిగా కొనసాగుతుంటే.. టీమిండియాలో ముగ్గురు ఆటగాళ్లు మా గెలుపుపై నీళ్లు చల్లారు.. మెరుగైన భాగస్వామ్యాన్ని నెలకొల్పుతూ మాకు విజయావకాశాలను దూరం చేశారు. మేము ఎంతో సత్తా చాటాలనుకున్నప్పటికీ.. ప్రతిక్షణం టీమిండియా ఆటగాళ్లు దానిని నిలువరించారు.. వచ్చే మ్యాచ్లో కచ్చితంగా మా బెస్ట్ ఇస్తాం. టీమిండియా కు గట్టి పోటీని ఇవ్వడానికి ప్రయత్నిస్తామని” బట్లర్ వ్యాఖ్యానించాడు.