Ugadi
Ugadi : తెలుగు వారికి కొత్త సంవత్సరం అయిన ఉగాది పండును ఈ ఏడాది మార్చి 30వ తేదీన జరుపుకుంటున్నారు. ఎంతో ఆనందంగా కుటుంబ సభ్యులతో ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు. కొత్త సంవత్సరం నాడు కొత్త దుస్తులు ధరించి, రకరకాల వంటలు తయారు చేసి సంతోషంగా జరుపుకుంటారు. ప్రతీ ఏడాది ఉగాది పండుగను చైత్ర మాసంలోని శుక్ల పక్షంలో జరుపుకుంటారు. అయితే ఉగాది రోజు ఉదయాన్నే లేచి కొత్త దుస్తులు ధరించి పూజలు నిర్వహిస్తారు. అయితే ఉగాది రోజు కొన్ని నియమాలు పాటించి దేవుడిని పూజిస్తేనే అంతా కూడా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. అయితే ఉగాది రోజు పాటించాల్సిన ఆ నియమాలేంటో చూద్దాం.
Also Read : ఉగాది రోజు ఈ పనులు చేస్తున్నారా.. మీ బతుకు బస్టాండే
కొత్త ఏడాది ఉగాది నాడు తప్పకుండా కొన్ని పనులు చేస్తే ఏడాది మొత్తం సంతోషాలతో ఉంటారని పండితులు చెబుతున్నారు. ఉగాది రోజు ఉదయం బ్రహ్మ ముహుర్తంలోనే లేవాలి. లేచిన తర్వాత నువ్వుల నూనె లేదా నలుగు పిండితో తలస్నానం చేయాలి. ఇలా చేసిన తర్వాత కొత్త దుస్తులు ధరించాలి. అయితే నలుపు రంగు కాకుండా ఎరుపు వంటి దుస్తులు ధరిస్తే ఉగాది రోజు మంచిది. ఇలా కొత్త దుస్తులు ధరించి ఉగాది నాడు పూజలు నిర్వహిస్తే అనుకున్న పనులు అన్ని కూడా జరుగుతాయి. ఈ ఉగాది రోజు జంతువులకు ఆహారం పెట్టాలి. అయితే ఉదయం పూట తప్పకుండా ఉగాది పచ్చడిని తయారు చేసి పూజలు చేయాలి. కేవలం ఉగాది పచ్చడి మాత్రమే కాకుండా ఇంకా ఏవైనా స్పెషల్ వంటలు కూడా చేయవచ్చు. కొందరు బొబ్బట్లు, పూర్ణాలు చేసి దేవుడికి నైవేద్యంగా పెడతారు. వీటిని దేవుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాత శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖానిచ.. సర్వారిష్టవినాశంచ నింబకందళ భక్షణమ్ అనే శ్లోకం చదవాలి. ఆ తర్వాత నైవేద్యంగా పెట్టిన ఉగాది పచ్చడిని తినాలి. మీరు ఉగాది రోజు తప్పకుండా ఈ పచ్చడిని తినాలి. అన్ని రుచులు ఉండే ఈ పచ్చడిని తింటే మంచి జరుగుతుందని పండితులు అంటున్నారు.
అన్ని రుచులు ఉండే ఈ పచ్చడిని తింటే జీవితంలో సంతోషం, సుఖం, బాధలు అన్ని కూడా సహజమే అని తెలియజేస్తుంది. అలాగే ఉగాది రోజు అన్ని మంచి పనులు చేయాలి. ఈ రోజు మీరు చేసిన పనులు బట్టి ఏడాది అంతా కూడా ఉంటుందని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఉగాది రోజు తప్పకుండా ఈ పనులు చేయడం మరిచిపోవద్దు. ఇలా మీరు నియమాలు ఆచరిస్తేనే మీకు ఏడాది అంతా కూడా బాగుంటుంది. కొందరు ఈ ఉగాది రోజున మాంసాహారం తినడం, మద్యం తాగడం వంటివి చేస్తుంటారు. ఇలాంటివి చేస్తే పాపం చుట్టుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పనులు చేయకూడదని పండితులు చెబుతున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.