Ugadi Festival : తెలుగు వారికి ఎంతో ప్రత్యేకమైన ఉగాది పండుగ వచ్చేసింది. ఈ ఏడాది ఉగాది పండును మార్చి 30వ తేదీన జరుపుకుంటున్నారు. ఇంటి మొత్తం ఈ ఉగాది పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే కేవలం తెలుగు వారు మాత్రమే ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు. ఈ కొత్త సంవత్సరం ఎంతో ముఖ్యమైనది. ఉగాది పండుగ రోజు కొత్త దుస్తులు ధరించి ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి కొత్త దుస్తులు ధరించి పూజలు నిర్వహిస్తారు. వేపాకు, మామిడి కాయలు ఇలా షడ్రురుచులతో పచ్చడి తయారు చేసి తింటారు. అయితే ఈ కొత్త సంవత్సరాల్లో ఒక్కో ఏడాదికి ఒక్కో పేరు ఉంటుంది. ఈ ఉగాదికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంగా పిలుస్తారు. మొత్తం తెలుగు క్యాలెండర్లలో 60 పేర్లు ఉంటాయి. ఒక్కో ఏడాది ఒక్కో పేరుతో ఉగాది పండుగను జరుపుకుంటారు. ప్రతీ ఏడాది ఛైత్ర మాసంలో శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు ఉగాది పండుగను జరుపుకుంటారు. ఇలా ఏడాదికి పేరు మారుతుంది. అయితే ప్రతీ ఏడాది వచ్చే కొత్త సంవత్సరానికి ఉండే పేరుకు ఓ అర్థం ఉంటుంది. మరి ఈ ఏడాది వచ్చే శ్రీ విశ్వావసు నామ సంవత్సరానికి అర్థం ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Also Read : ఉగాది రోజు తప్పకుండా చేయాల్సిన పనులివే
ప్రతీ ఏడాది వచ్చే కొత్త సంవత్సరానికి ఓ అర్థం ఉన్నట్లు ఈ ఏడాది వచ్చే శ్రీ విశ్వావసు నామ సంవత్సరానికి కూడా ఉంది. అయితే శ్రీ అనేది సంపద, పవిత్రత, భక్తి, శుభ్రం, ఐశ్వర్యం వంటి వాటిని సూచిస్తుంది. విశ్వావసు అనేది ఏదైనా శుభాన్ని సూచిస్తుంది. ఈ కొత్త సంవత్సరం అయినా శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అందరికి కూడా మంచి జరుగుతుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా శుభాలు జరుగుతాయి. అలాగే ఐశ్వర్యం వస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ కొత్త సంవత్సరంలో చాలా మందికి ఆదాయం కూడా ఎక్కువగా వస్తుందని పండితులు చెబుతున్నారు. ఏ పనిలో అయినా కూడా నష్టాలు కాకుండా లాభాలను ఇస్తుందట. ముఖ్యంగా అందరి ఇంట్లో సంతోషం ఎక్కువగా ఉంటుంది. వ్యాపారులకు లాభాలు బాగా వస్తాయి. అలాగే దేశాల మధ్య ఎలాంటి వైరం, యుద్ధాలు ఉన్నా కూడా ఈ కొత్త సంవత్సరం అన్ని కూడా ఆగిపోతాయట. అందరూ కూడా ప్రేమతో ఇతరులతో వ్యవహరిస్తారు. ఈ కొత్త ఏడాదిలో ప్రతీ ఒక్కరికి మంచి జరుగుతుందని అంటున్నారు. అన్ని చోట్ల కూడా క్షేమమే ఉంటుందని పండితులు చెబుతున్నారు. అలాగే రైతులకు కూడా బాగా పంటలు పండుతాయి. సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా దుస్తుల వ్యాపారం చేసే వారికి బాగా కలసి వస్తుందని పండితులు అంటున్నారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం క్షేమాన్ని, మంచిని ఇచ్చేదని అర్థం.