Ugadi : తెలుగు వారికి ఉగాది కొత్త సంవత్సరం. ఈ ఏడాది ఉగాది పండుగను మార్చి 30వ తేదీన జరుపుకుంటున్నారు. ఎంతో ఆనందంగా కుటుంబ సభ్యులతో జరుపుకుంటారు. ఉగాది పండుగ రోజు కొత్త దుస్తలు ధరించి, రకరకాల వంటలు తయారు చేసి సంతోషంగా జరుపుకుంటారు. ప్రతీ ఏడాది ఉగాది పండుగను చైత్ర మాసంలోని శుక్ల పక్షంలో జరుపుకుంటారు. ఉగాది రోజు ఉదయాన్నే లేచి కొత్త దుస్తులు ధరించి.. దేవుడిని పూజిస్తే అంతా కూడా మంచి జరుగుతుందని పండితులు చెబుతుంటారు. కానీ కొందరికి తెలియక కొన్ని తప్పులు చేస్తు్ంటారు. దీనివల్ల సమస్యలను ఎదుర్కొంటారు. అయితే ఉగాది రోజు మీరు ఈ పనులు చేస్తే మాత్రం మీ జీవితం బస్టాండే. మరి ఉగాది రోజు చేయకూడని ఆ పనులేంటో ఈ స్టోరీలో చూద్దాం.
Also Read : ఉగాది రోజు ఈ పనులు చేస్తే.. దరిద్రమంతా మీతోనే
దిగులుగా ఉండకూడదు
కొత్త సంవత్సరం నాడు కొందరు దిగులుగా ఉంటారు. ఇలా ఉండకూడదు. సంతోషంగా ఉంటేనే ఏడాది అంతా కూడా హ్యాపీగా ఉంటారు. ఎన్ని సమస్యలు ఉన్నా కూడా వేటి గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. కొత్త సంవత్సరం నాడు హ్యాపీగా ఉండాలి. బాధతో ఉండే ఏడాది మొత్తం కూడా ఇలానే ఉంటారని పండితులు చెబుతున్నారు.
తప్పుగా మాట్లాడకూడదు
ఉగాది రోజు తప్పుగా మాట్లాడకూడదు. కొందరు అసభ్యకరమైన మాటలు మాట్లాడుతుంటారు. వీటి గురించి మాట్లాడితే మానసిక ఆరోగ్యం దెబ్బ తినడంతో పాటు ఇంట్లో సంతోషం పోతుంది. అలాగే ఇంట్లో కష్టాలు కూడా మొదలవుతాయి. అయితే కేవలం ఉగాది రోజు మాత్రమే కాకుండా డైలీ కూడా మంచిగా మాట్లాడటం అలవాటు చేసుకుంది.
గందరగోళంగా ఉండకూడదు
ఉగాది రోజు పనులు చేసేటప్పుడు గందరగోళంగా చేయకూడదు. ఏ పని చేసినా కూడా నెమ్మదిగా చేయాలి. తొందర పాటు పనులు చేస్తే మీకు ఆందోళన ఎక్కువ అవుతుంది. దీనివల్ల మీరు ఏడాది అంతా కూడా గందరగోళంగా ప్రతీ పనిని కూడా చేస్తారు.
గొడవలు పడకూడదు
కొందరు ప్రశాంతంగా ఉండకుండా గొడవలు పడుతుంటారు. ఇతరులతో గొడవలు పడకుండా సంతోషంగా ఉండండి. ఉగాది రోజు సంతోషంగా ఉంటే ఏడాది అంతా కూడా హ్యాపీగా ఉంటారు. కాబట్టి ఉగాది రోజు ఇతరుల మీద కోపం, ఈర్ష్యతో ఉండవద్దు.
ఆలస్యంగా పడుకోకూడదు
ఉగాది రోజు వేకువ జామునే లేవాలి. ఆలస్యంగా లేస్తే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుందని పండితులు చెబుతున్నారు. ఉదయం నాలుగు గంటలకి లేచి ఇంటిని శుభ్రం చేసి పూజ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
పితృదేవతలను మరిచిపోవద్దు
ఉగాది పండుగ రోజు పితృ దేవతలను తప్పకుండా పూజించాలి. ఇలా చేస్తే వారి ఆశీస్సులు అందుతాయి. ఉగాది రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా పితృ దేవతలను అసలు మరిచిపోవద్దు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.
Also Read : మహాశివుడికి తుమ్మి పువ్వులు అంటే ఎందుకు ఇష్టం? దీని వెనుక ఉన్న చరిత్ర ఏంటి?