Court Movie : ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టిన సినిమాలలో ఒకటిగా ‘కోర్ట్'(Court Movie) చిత్రం నిల్చింది. నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ వచ్చింది. ఫలితంగా నిన్న రెండు కొత్త సినిమాలు విడుదల అయ్యినప్పటికీ స్టడీ రన్ ని కొనసాగిస్తూ ముందుకు దూసుకుపోతుంది. ఈ చిత్రం లో నటించిన నటీనటులకు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. బాలనటుడిగా పలు సినిమాల్లో అలరించిన హర్ష రోషన్(Harsh Roshan), ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ ద్వారా పాపులారిటీ ని సంపాదించుకున్న శ్రీదేవి(Sridevi) కి ఈ సినిమా ద్వారా టాలీవుడ్ లో మంచి గుర్తింపు లభించింది. ఇక ప్రత్యేక పాత్రలో కనిపించిన ప్రియదర్శి(Priyadarshi) గురించి చెప్పనవసరం లేదు. ఆయన బ్రాండ్ వేల్యూ మరింత పెరిగింది. అదే విధంగా శివాజీ(Shivaji) కి ఈ చిత్రం నటుడిగా పునర్జన్మని ఇచ్చింది.
Also Read : కన్నప్ప’ విడుదల వాయిదా..కారణం ఏమిటంటే!
విజయవంతంగా రెండు వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టింది అనేది ఇప్పుడు వివరంగా చూద్దాం. నైజాం ప్రాంత ప్రజలు మొదటి నుండి సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కే సినిమాలను అద్భుతంగా ఆదరిస్తూ వచ్చారు. ఈ సినిమాకి కూడా అక్కడి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 14 రోజుల్లో నైజాం ప్రాంతంలో 10 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా సీడెడ్ లో దాదాపుగా కోటి 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, ఆంధ్ర లో 8 కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ చిత్రానికి 19 కోట్ల 69 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, 33 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
అదే విధంగా కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా ప్రాంతాలకు కలిపి 2 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఓవర్సీస్ లో 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ముఖ్యంగా నార్త్ అమెరికా లో ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ చిత్రం కంటే ఎక్కువ వసూళ్లు రావడం విశేషం. వకీల్ సాబ్ చిత్రానికి 8 లక్షల డాలర్లు రాగా, ‘కోర్ట్’ చిత్రానికి 1 మిలియన్ కి పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. వకీల్ సాబ్ కాలం నాటి పరిస్థితులు వేరు అయినప్పటికీ పవన్ కళ్యాణ్ సినిమా వసూళ్లను సైతం దాటిన ఘనత ఈ చిత్రానికి చెందింది. నిన్న విడుదలైన రెండు సినిమాలలో నితిన్ ‘రాబిన్ హుడ్’ చిత్రం కంటే ఈ సినిమాకే అనేక ముఖ్య ప్రాంతాలలో అత్యధిక వసూళ్లు వస్తున్నాయి