Ugadi Astrology
Ugadi Astrology: హిందూ పండుగల్లో ఉగాది చాలా ప్రత్యేకమైనది. తెలుగు వారికి ఈ పండుగతోనే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ ఉగాది పండుగను తప్పకుండా ప్రతీ ఒక్క హిందువులు జరుపుకుంటారు. ఈ ఉగాది రోజు నుంచే కొందరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు. అయితే హిందువుల కొత్త సంవత్సరం ఉగాది చైత్ర మాసంలోని శుక్ల పక్షంలో ఉగాది పండుగను జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది ఉగాది పండుగను మార్చి 30వ తేదీన జరుపుకుంటున్నారు. అయితే ఈ ఉగాదికి కొన్ని రాశుల వారికి అదృష్టం రాబోతుంది. ఇంతకీ ఆ రాశులేవో ఈ స్టోరీలో చూద్దాం.
మేష రాశి
ఈ రాశి వారికి కాస్త కష్టంగా ఉంటుంది. మొదటిలో కాస్త సమస్యలు వస్తాయి. ఆ తర్వాత సమస్యలు తీరిపోతాయి. ఈ ఏడాది ఆర్థిక సమస్యలు అన్ని కూడా తీరిపోతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి.
వృషభ రాశి
వీరు ఈ ఏడాది ఎక్కువగా శుభవార్తలు వింటారు. అలాగే ఇంట్లో శుభకార్యాలు ఎక్కువగా జరుగుతాయి. అన్ని విధాలుగా వీరికి ఈ ఏడాది బాగుంటుంది. ఇప్పటి వరకు ఉన్న సమస్యలు అన్ని కూడా తీరుతాయి.
మిథున రాశి
సోదరులతో గొడవలు అయ్యే ప్రమాదం ఉంది. ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి. శని సంచారం వల్ల నూతన కార్యాలు చేపడతారు. మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. కాకపోతే కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటక రాశి
ఈ ఏడాది ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు. ఎక్కువగా ధనం వ్యయం అవుతుంది. అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త వహించండి. ఇప్పటి వరకు ఉన్న అప్పులు తీరిపోతాయి. సోదరులతో గొడవలు వచ్చే ప్రమాదం ఉంది. కాస్త జాగ్రత్త వహించండి.
సింహ రాశి
అష్టమ శని వల్ల ఈ రాశి వారికి అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే పనుల్లో చిరాకు, ఆటంకాలు ఏర్పడతాయి. చిన్న విషయానికి కూడా కోపానికి గురి కావద్దు. ముఖ్యంగా గొడవలకు అయితే అసలు వెళ్లవద్దు. ఎక్కువగా ధన నష్టం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి.
కన్య రాశి
విదేశీ ప్రయాణాలు వీరికి బాగా లాభాన్ని తీసుకొస్తాయి. అలాగే వ్యాపారంలో వృద్ధి ఉంటుంది. చేపట్టిన అన్ని పనులు కూడా సకాలంలో పూర్తి అవుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు ఇది మంచి సమయం.
తులా రాశి
ఈ రాశి వారికి కాస్త ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్య సమస్యలు అన్ని కూడా తీరుతాయి. ఆకస్మిక ధనలాభం పొందుతారు. నూతన గృహం కొనుగోలు చేస్తారు. ఇప్పటి వరకు ఉన్న సమస్యలు అన్ని కూడా తీరిపోతాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. అలాగే తీర్థ యాత్రలకు వెళ్తారు.
వృశ్చిక రాశి
ఈ రాశి వారికి ఆనందం, సుఖం, లాభం అన్ని కలుగుతాయి. విద్యార్థులు, ఉద్యోగులకు బాగా కలిసి వస్తుంది. రుణ బాధలు తీరుతాయి. అలాగే వాహనాలు కొనుగోలు చేస్తారు. అన్ని విధాలుగా కూడా ఈ ఏడాది బాగుంటుంది.
ధనుస్సు రాశి
ఈ రాశి వారికి ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తాయి. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వీరి వల్ల మంచి జరుగుతుంది. అలాగే ఇప్పటి వరకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు అన్ని కూడా దూరం అవుతాయి. మానసికంగా ఎక్కువగా ఆందోళన చెందుతారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి.
మకర రాశి
ఈ రాశి వారికి గౌరవ మర్యాదలు బాగా లభిస్తాయి. వ్యవసాయం, వ్యాపారం వంటి వాటిలో లాభాలను పొందుతారు. అయితే గొడవలకు దూరంగా ఉండటం మంచిది. వాయిదా అయిన పనులు అన్ని కూడా ఈ ఏడాది పూర్తి అవుతాయి.
కుంభ రాశి
ఈ ఏడాది వీరు కోపానికి దూరంగా ఉండాలి. కోపం వల్ల బంధాలను కూడా దూరం చేసుకోవాల్సి వస్తుంది. అలాగే శారీరకంగా, మానసికంగా కాస్త ఒత్తిడి ఉంటుంది. ప్రతీ పనిని కూడా ఆలోచించి చేయాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో కాస్త సమస్యలు ఉంటాయి. కాబట్టి ఆచితూచి వ్యవహరించండి.
మీన రాశి
ఈ రాశి వారికి ఎక్కువగా ఒత్తిళ్లు, చిరాకు ఉంటుంది. వీరికి ఏలినాటి శని ఉంటుంది. దీనివల్ల ఏ పని తలపెట్టినా కూడా విజయం లభించదు. ప్రతీ విషయంలో కూడా సమస్యలు ఎదురు అవుతాయి. రాహువు వల్ల ఆకస్మికంగా ధన వ్యయం జరుగును.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.