Mohammed Siraj: ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 196 రన్స్ స్కోర్ చేసింది. సాయి సుదర్శన్ (63) టాప్ స్కోరర్ గా నిలిచాడు. హార్దిక్ పాండ్యా 2 వికెట్లు పడగొట్టాడు.. 197 పరుగుల విజయ లక్ష్యం తో రంగంలోకి దిగిన ముంబై జట్టుకు అదిరిపోయే ఆరంభం లభించలేదు. ఓపెనర్ రోహిత్ శర్మ (8) రెండు ఫోర్లు కొట్టి.. ఉత్సాహంగా కనిపించినప్పటికీ.. మహమ్మద్ సిరాజ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక మరో ఓపెనర్ రికెల్టన్(6) ఆరు పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సిరాజ్ దూకుడు ఫలితంగా ముంబై జట్టు 35 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఇక ప్రస్తుతం సూర్య కుమార్ యాదవ్ (30*), తిలక్ వర్మ (38*) క్రీజ్ లో ఉన్నారు..
సిరాజ్ కసి
తక్కువ ఎత్తులో బంతివేసి రోహిత్ శర్మను క్లీన్ బౌల్డ్ చేసిన గుజరాత్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్ కావడంతోనే మహమ్మద్ సిరాజ్ బిగ్గర గా అరిచాడు. సాధారణంగా తనను ఎవరైనా ఆటగాడు గెలికితే మహమ్మద్ సిరాజ్ రియాక్షన్ వైల్డ్ ఫైర్ లాగా ఉంటుంది. అయితే రోహిత్ శర్మతో మహమ్మద్ సిరాజ్ కు ఎక్కడ చెడిందా అని ఆలోచిస్తుంటే.. తెరపైకి ఒక విషయం వచ్చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీలో మహమ్మద్ సిరాజ్ కు అవకాశం లభించలేదు. అయితే సిరాజ్ ను ఎందుకు తీసుకోలేదనే కారణాన్ని ఇప్పటికీ రోహిత్ బయట పెట్టలేదు. అయితే రోహిత్ శర్మ సూచన వల్లే మహమ్మద్ సిరాజ్ కు జట్టులో చోటు కల్పించలేదని తెలుస్తోంది.. దీంతో జాతీయ జట్టులో తనకు స్థానం లేకపోవడానికి ప్రధాన కారణం రోహిత్ శర్మ అని సిరాజ్ కు తెలిసింది. ఇక నాటి నుంచి అతడు ఆ పగను అలానే అంటిపెట్టుకొని ఉంటున్నాడు. ఇక బెంగళూరు జట్టు అతడిని ఇటీవల మెగా వేలంలో రిటైన్ చేసుకోలేదు. విరాట్ కోహ్లీ వల్లే బెంగళూరు జట్టు యాజమాన్యం అలా చేసిందని మొదటి నుంచి కూడా మహమ్మద్ సిరాజ్ కున్న అభిప్రాయం. అందువల్లే తనను బెంగళూరు జట్టు యాజమాన్యం రిటైన్ చేసుకోలేదని.. అందువల్లే తాను గుజరాత్ జట్టుకు వెళ్లాల్సి వచ్చిందని మహమ్మద్ సిరాజ్ భావిస్తుంటాడు. అంతేకాదు సోషల్ మీడియాలో తాను ఎదుర్కొంటున్న పరిస్థితులకు సంబంధించి వీడియోల రూపంలో పెడుతుంటాడు.. ఇక శనివారం అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో ముంబై జట్టుకు సంబంధించిన ఓపెనర్ల వికెట్లను పడగొట్టి సిరాజ్ ఒకసారిగా సంచలనం సృష్టించాడు. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మహమ్మద్ సిరాజ్ అభిమానులు అతడి నామస్మరణ చేస్తూ సోషల్ మీడియాలో సంచలనమైన పోస్టులు పెడుతున్నారు.
Siraj getting the “DSP treatment” today
GT batters showing no mercy! Tough outing for him.#GTvMI pic.twitter.com/eMQwhSUhAo— Vijay Singh (@vstechsolution) March 29, 2025