Today horoscope in telugu
‘Today horoscope in telugu ‘: జ్యోతిష శాస్త్రం ప్రకారం శుక్రవారం శుక్రవారం ద్వాదశరాసులపై పూర్వాభద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు లక్ష్మీనారాయణ యోగం కారణంగా మీన రాశి వారికి అధిక ప్రయోజనాలు ఉండలు ఉన్నాయి. అలాగే మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రాశి వారు ఈ రోజు ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. విదేశాల్లో ఉండేవారిని శుభవార్తలు వింటారు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈరోజు అనుకున్న వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని కొత్తపెట్టబడులు పెడతారు. ఆరోగ్యంపై ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారి కుటుంబ సభ్యుల్లో కొంత ఆందోళనగా ఉంటుంది. ఇప్పుడు చేసే కొన్ని కార్యక్రమాల వల్ల భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు అధికారుల నుంచి మద్దతు ఉంటుంది. లక్ష్యాలను పూర్తి చేయడంతో ప్రశంసలను పొందుతారు. కొందరికీ జీతం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. విహార యాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దల సలహా తీసుకోవాలి. వీరికి శత్రువుల బెడద ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు తోటి వారి మద్దతు ఉంటుంది. దీంతో ఊహించిన దానికంటే అదనపు ఆదాయాన్ని పొందుతారు. అయితే ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి సమాజంలో గుర్తింపు పెరుగుతుంది. ఏ పని మొదలుపెట్టిన అందులో విజయం సాధిస్తారు. రాజకీయాల్లో ఉండే వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొత్తగా పెట్టుబడులు పెడతారు. ఇంట్లో జరిగే శుభకార్యం గురించి చర్చిస్తారు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సొంత వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : నిరాశ ఉద్యోగులు ఈరోజు సమస్యలు ఎదుర్కొంటారు. కొందరికి అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. అయితే మాటలు అదుపులో ఉంచుకొని వారి కి అనుగుణంగా ఉండాలి. లేకుంటే తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులు లక్ష్యాలను పూర్తి చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. ఇంట్లో జరిగే శుభకార్యం గురించి చర్చిస్తారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : కన్యా రాశి వారికి ఈరోజు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొత్తగా వ్యాపార ప్రారంభించాలనుకునే వారికి ఇదే మంచి సమయం. కుటుంబ సభ్యుల మధ్య కొన్ని సమస్యలు ఏర్పడతాయి. అయితే మాటల మాధుర్యంతో వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. సోదరుల అండతో ఇంట్లోని సమస్యలను పరిష్కరించుకుంటారు. పెండింగ్ బకాయిలు వసూలు అవుతాయి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . తులా రాశి వారు ఈరోజు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అయితే నైపుణ్యం తెలివితేటలు ఉన్నవారు అధిక ఆదాయాన్ని పొందుతారు. కొన్ని ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. వీటిని పూడ్చేందుకు అదనపు పనిని చేస్తారు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. నిర్ణయం తీసుకునే ముందు జీవిత భాగస్వామి సలహా తీసుకోవాలి. ఎదుటివారి మాటలతో మనసు ఆందోళనగా ఉంటుంది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు మిశ్రమ ఫలితాలు పొందుతారు. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు పెరిగినా అదుపులోకి వస్తాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఇదే అనుకూల సమయం. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. ఇంట్లో వాగ్వాదం ఏర్పడితే మౌనంగా ఉండడమే మంచిది. పిల్లల వివాహం గురించి చర్చిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు తండ్రి సలహా తీసుకోవాలి. ఉద్యోగులు సీనియర్ల అండతో లక్ష్యాలను పూర్తిచేస్తారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు మెరుగైన ఫలితాలు రానున్నాయి. పెండింగ్ లో ఉన్న డబ్బు వసూలు అవుతుంది. కొన్ని కారణాల వల్ల అదనపు ఖర్చులు పెరుగుతాయి. పెట్టుబడిలో పెట్టేవారు పెద్దల సలహా కచ్చితంగా తీసుకోవాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. వీరికి ఆశించిన ప్రయోజనాలు దక్కుతాయి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు కొత్తగా పనిని ప్రారంభిస్తే దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులు తమ లక్ష్యాలను పూర్తి చేయడంతో బహుమతిని పొందుతారు. చిన్నపిల్లల కోసం కొన్ని ప్రత్యేక వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారులు శత్రువుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటారు. సాయంత్రం మనసు ఆందోళనగా ఉంటుంది. స్నేహితులను కలవడం ద్వారా ఉల్లాసంగా మారిపోతుంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వారికి పదోన్నతి దక్కే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు ఊహించిన దానికంటే అధిక లాభాలు వస్తాయి. కుటుంబంలో ఏదైనా వివాదం ఉంటే అది నేటితో పరిష్కారం అవుతుంది. అయితే తండ్రితో గొడవ జరిగితే మౌనంగా ఉండటమే మంచిది. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. అనుకోకుండా ప్రయాణాలు ఉంటాయి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . ఇంటి అవసరాల కోసం కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. దీంతో ఆదాయం తరిగిపోతుంది. ఉద్యోగులు అదరపు ఆదాయం కోసం ప్రయత్నిస్తారు. వ్యాపారులకు మిశ్రమంగా లాభాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది.