Chandrababu
Chandrababu : ఏపీలో కొత్త జిల్లాల( new districts ) ఏర్పాటు ప్రతిపాదన ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొత్త జిల్లాల ఏర్పాటు జరిగింది. అయితే ఈ ఏర్పాటులో కొన్నిచోట్ల పారదర్శకత పాటించలేదన్న విమర్శ ఉంది. అయితే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరికొన్ని జిల్లాలను విభజిస్తామని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇప్పుడు దాని కార్యాచరణపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. రెండు రోజుల కలెక్టర్ సదస్సులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా కొత్త జిల్లాల్లో పాలనపై సీఎం పలు సూచనలు చేశారు. ఉమ్మడి జిల్లాతో సంబంధం లేకుండా జిల్లా అధికారులు స్వేచ్ఛగా వారు విధులు నిర్వహించే వెసులుబాటు ఉండాలని స్పష్టం చేశారు. ఈ మేరకు సంబంధిత ఆదేశాలను హెచ్ఓడీలకు రెండు రోజుల్లో ఆదేశాలు జారీ చేయాలని సూచించారు చంద్రబాబు.
Also Read : ఆంధ్రజ్యోతి.. చంద్రబాబుకే ఎదురెళుతోందే?
* కొత్త జిల్లాల్లో పాలనపై చర్చ
కలెక్టర్ల సదస్సులో( collectors meeting ) భాగంగా సీఎం కొత్త జిల్లాల్లో పాలన పై చర్చించారు. కొత్త జిల్లాల్లో ఎటువంటి స్టాప్ సమస్య లేకుండా రెగ్యులేషన్ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. పని ఒత్తిడికి తగ్గట్టుగా అధికారులు, సిబ్బందిని కేటాయించాలని వెల్లడించారు. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ తో పాటు ప్రత్యేకించి జిల్లాల హెడ్ క్వార్టర్లలో కనీసం మూడు హోటల్స్ ఉండేలా చూడాలన్నారు. కొత్త జిల్లాల్లో మౌలిక వసతుల కల్పన అంశంపై కూడా అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త జిల్లాల ఏర్పాటుకు ఒక నిర్ణయం తీసుకుందామని సీఎం అభిప్రాయ పడినట్లు సమాచారం.
* అప్పట్లో జిల్లాల విభజన
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వ హయాంలో 13 ఉమ్మడి జిల్లాలను పునర్విభజించారు. 26 జిల్లాలుగా మార్చేశారు. అయితే చాలా చోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విభజన జరగలేదన్న విమర్శ ఉంది. పైగా కొన్ని ప్రాంతీయులు తమకు ప్రత్యేక జిల్లాగా పరిగణించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ డిమాండ్లు ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి వాటి జోలికి పోకుండా ఉండడమే శ్రేయస్కరమని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఆ అంశాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
* ముందుగా మౌలిక వసతుల కల్పన
అయితే చాలా కొత్త జిల్లాలకు సంబంధించి మౌలిక వసతులు లేవు. పేరుకే ప్రత్యేక జిల్లా కానీ వసతులు అంతంత మాత్రమే. పార్వతీపురం మన్యం( parvatipuram manyam) జిల్లా నే తీసుకుంటే.. అక్కడ అధికారులు, సిబ్బంది ఉండేందుకు ఇబ్బంది పడుతున్నారు. అదే సమయంలో అల్లూరి లాంటి జిల్లాల్లో కూడా ఇబ్బందికర పరిస్థితులు తప్పడం లేదు. అందుకే సీఎం చంద్రబాబు జిల్లా కేంద్రాల్లో హోటల్స్ తో పాటు అధికారులు ఉండేలా ఏర్పాట్లు జరగాలని ఆదేశించారు. అయితే జిల్లాల సమస్యను ఏకంగా అమరావతికి పిలిచి మాట్లాడడం నిజంగా శుభ పరిణామమే. ప్రత్యేక జిల్లాల ఏర్పాటు అనేది తాత్కాలికంగా పక్కన పెట్టి.. కొత్త జిల్లాల్లో మౌలిక వసతులు కల్పించాలని చూస్తుండడం ఆహ్వానించదగ్గ పరిణామమే.
Also Read : ఉద్యోగుల బకాయిలు క్లియర్.. విశ్వాసాన్ని పెంచుకున్న చంద్రబాబు!