Hindu Mythology
Hindu Mythology : హిందూ సాంప్రదాయ ప్రకారం.. పుట్టిన ప్రతి బిడ్డకు తలనీలాలు తీయాలని చాలామంది అనుకుంటారు. కొందరు పాపా లేదా బాబు వెంట్రుకలు మొదటిసారి కత్తిరించినప్పుడు చిన్నపాటి ఫంక్షన్ చేస్తారు. బంధువులను పిలిచి విందు ఇస్తారు. అలాగే కొందరు ఆలయాలకు వెళ్లి మొదటిసారి వెంట్రుకలను దేవునికి సమర్పిస్తారు. నేటి కాలంలో చాలామంది తమ ఇలవేల్పుకు మొదటిసారి పుట్టు వెంట్రుకలను ఇచ్చి.. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి వద్దకు వెళ్లి పూర్తిగా తీసేస్తారు. అయితే ఈ తల వెంట్రుకలను ఇవ్వడానికి గల కారణం ఏంటి? దీని వెనుక ఉన్న శాస్త్రీయ, సైన్స్ కోణాలు ఎలా ఉన్నాయి? అనే వివరాల్లోకి వెళ్దాం..
Also Read : మార్కెట్లోకి కొత్తగా Samsung ల్యాప్ ట్యాప్స్.. అదరిపోయే AI ఫీచర్స్.. షాకింగ్ ధరలో.
మహాభారతంలో ఒక కథనం ప్రకారం.. సైంధవుడని సంహరించేందుకు భీముడు రెడీ అవుతారు. అయితే ధర్మరాజు భీమునితో ఇలా చెబుతాడు.. కౌరవుల చెల్లెలు అయిన దుశల భర్త సైంధవుడు.. అందువల్ల దృశ్యల మనకు కూడా సోదరి అవుతుంది. సోదరి భర్తను సంహరించడం ధర్మసమ్మతం కాదు.. అని చెప్తాడు.. అయితే సైంధవుడిని ఓడించాలి కనుక.. అతడి తల వెంట్రుక తీసేసిన ఓడించినట్లే అని చెబుతాడు. దీంతో భీముడు సైంధవుడుని ఓడించి గుండు గీయించేస్తారు. అలా అప్పటినుంచి తల నుంచి వెంట్రు కలను తీసేస్తే పాపాలు పోతాయని భావిస్తూ వస్తున్నారు.
అలాగే పుట్టిన ప్రతి బిడ్డ వెంట్రుకలతో జన్మిస్తుంది. ఈ క్రమంలో వెంట్రుకల్లో అనేక బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇవి అలాగే ఉంటే బిడ్డ ఆరోగ్యం పై ప్రభావం పడుతుంది. అందువల్ల పుట్టుకతో వచ్చిన వెంట్రుకలను తీసివేయాలని పెద్దలు నిర్ణయించారు. ఇవి తీసివేస్తే ఆరోగ్యంగా ఉంటారని పురాతన కాలం నుంచే నమ్ముతున్నారు. అందువల్ల పుట్టిన ప్రతి బిడ్డకు వెంట్రుకలు తీసేయాలని ఆచారం వచ్చింది. ఇలా ఏరకంగా చూసినా తల వెంట్రుకలను తీసివేయడం వల్ల ఒక బిడ్డకు ఆరోగ్యమే అని తేలడంతో చాలామంది ఈ వెంట్రుకలను మొదటిసారి దేవునికి సమర్పిస్తూ వస్తారు.
అయితే చాలామంది తమకు ఇలవేల్పుగా ఉన్న దేవుడికి మొదటగా సమర్పించి ఆ తర్వాత పూర్తి తలనీలాలను వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తూ వస్తున్నారు. కలియుగ దైవం వెంకటేశ్వరుడు అని చాలామంది నమ్ముతారు. అందువల్ల ఇక్కడ తలని పూర్తిగా ఇవ్వడం వల్ల తమ పాపాలు పోతాయని భావిస్తారు. పుట్టిన బిడ్డ వెంట్రుకలు మాత్రమే కాకుండా చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలు కూడా తిరుమలకు వెళ్లినవారు తమ తలనీలాలను సమర్పిస్తూ వస్తారు. తలనీలాలు సమర్పించడం వల్ల కొందరిలో ఉండే బ్యాక్టీరియా పూర్తిగా నశిస్తుంది. అంతేకాకుండా మెదడు చురుగ్గా పనిచేస్తుంది. వేసవిలో అయితే కొందరు ప్రత్యేకంగా తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు. ఈ సమయంలో గుండు గీచుకోవడం వల్ల తల చల్లగా ఉంటుంది.
ఇక హిందూ సాంప్రదాయం ప్రకారం క్షవరం చేయించుకోవాలని అంటారు. అయితే క్షవరం అనే మాటకు బదులు కళ్యాణమని పలకాలని జనమే జయయుడి సోదరుడైన శతానికుడు సూచించారట. అందుకే అప్పటినుంచి కళ్యాణ కట్ట అని పిలుస్తున్నారు. అందుకే ఆలయాల్లో కళ్యాణకట్ట అని బోర్డు ఉంటుంది. ఆలయాలకు వెళ్లినవారు ప్రత్యేకంగా టికెట్ తీసుకొని తమ తలనీలాలను సమర్పిస్తూ ఉంటారు.