Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై శతభిషా నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు పరిస్థితులు అనుకూలంగా మారడంతో అధిక లాభాలు పొందుతారు. మరికొన్ని రాశుల వారు ఫైనాన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈరోజు ఉద్యోగులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీల విషయంలో కొత్తవారిని నమ్మకూడదు. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వీరితో వ్యాపార అభివృద్ధిని చేసుకోవడానికి కృషి చేస్తారు కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : రాజకీయాల్లో ఉండే వారికి అనుకూలమైన వాతావరణం అవుతుంది. ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు కొత్తగా ప్రాజెక్టులను ప్రారంభించాలని అనుకుంటే ఇదే మంచి సమయం. విద్యార్థులకు గురువుల మద్దతు ఉండడంతో పోటీ పరీక్షల్లో రాణిస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
మిథున రాశి( మృగశిర 3,4 ): ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం. అవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి. విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో పోటీపరీక్షల్లో రాణిస్తారు. ఉద్యోగులు పదోన్నతి పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఉద్యోగులకు సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారస్తులకు అనుకోకుండా ధన లాభం ఉండే అవకాశం ఉంది. అయితే ఇదే సమయంలో ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో వ్యాపారులు లాభాలు పొందుతారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : కన్య రాశి వారికి ఈ రోజు అనుకూలమైన వాతావరణ ఉంటుంది. గతంలో ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారులు ప్రత్యర్థులను ఓడించడానికి అన్ని విధాలుగా కృషి చేస్తారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా గడుస్తుంది