Today 6 august 2025 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై ఉత్తరాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణ ఉండనుంది. మరికొన్ని రాశుల వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారికి ఈ రోజు కెరీర్ పరంగా శుభవార్త వింటారు. ఉద్యోగులు కార్యాలయంలో నైపుణ్యం ప్రదర్శించడంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే కుటుంబ సభ్యుల మద్దతు తీసుకుంటారు. గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. కొత్త ఒప్పందాలు చేసుకునే ముందు వారి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఉద్యోగులకు ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మీరు ఏ పని చేపట్టిన ఈరోజు విజయవంతంగా పూర్తి చేస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఏవైనా గొడవలు ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. దూరపు బంధువుల నుంచి శుభవార్త వింటారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. పిల్లల కెరీర్ కు సంబంధించి శుభవార్తలు వింటారు. తల్లిదండ్రుల మాటలను వినాలి. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే అప్పు తీసుకోవాల్సి వస్తుంది. సమాజంలో గౌరవం కోసం కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యకలాపాలపై దృష్టి పెడతారు. ఇంట్లో జరిగే శుభకార్యం గురించి ప్రత్యేకంగా చర్చిస్తారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : . . ఈ రాశి వారు ఈ రోజు ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న గొడవలు సమస్య పోతాయి. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అయితే ఉద్యోగులు కార్యాలయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏవైనా సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించేందుకు ప్రయత్నించాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టే వ్యాపారులకు శుభవార్తలు అందుతాయి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారికి ఈ రోజు అడ్డంకులు తొలగిపోతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. చట్టపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. అంకిత భావంతో పనిచేస్తే అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. రాజకీయ రంగాల్లో ఉండే వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . వ్యాపారులు కొత్త అప్పులు చేయాల్సి వస్తుంది అయితే ఎవరికైనా అప్పు ఇవాల్సి వస్తే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు కొత్త అవకాశాలను పొందుతారు. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఖర్చులను నియంత్రించుకోవాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే గురువుల మద్దతు ఉంటుంది. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వివాదం రాకుండా చూసుకోవాలి. వ్యాపారులు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాల్సి వస్తే ఆలోచించాలి. బంధువుల నుంచి రుణ సహాయం అందుతుంది. ఏదైనా పని ప్రారంభిస్తే దానిని వెంటనే పూర్తి చేయాలి. కొత్తగా పరిచయమైన వ్యక్తుల నుంచి ధన సహాయం పొందుతారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) :. ఈ రాశి వారు ఈరోజు సరదాగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. దూరపు బంధువుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. విదేశాల్లో ఉండేవారి నుంచి వ్యాపారానికి సంబంధించిన సమాచారం సేకరిస్తారు. వ్యాపారులు కొత్త భాగస్వాములను చేర్చుకుంటారు. అయితే వీరితో అప్పుడే ఆర్థిక వ్యవహారాలు జరపకుండా ఉండాలి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . రాజకీయరంగంలో ఉండే వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కొన్ని పనులను పూర్తి చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇంట్లోని రహస్యాలను ఇతరులకు చెప్పవద్దు. ఎవరైనా డబ్బు ఇస్తే తిరిగి చెల్లించే స్తోమత ఉంటే తీసుకోవాలి. వివాదాల్లోకి తల దూర్చకుండా ఉండాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . ఈ రాశి వారి ఇంట్లో ఈరోజు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అయితే మనసును ప్రశాంతంగా ఉంచుకొని వాటిని పరిష్కరించుకోవాలి. మాటలను అదుపులో ఉంచుకోకపోతే వివాదం ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక వాతావరణం లో ఉండిపోవడానికి ఇష్టపడతారు. గతంలో చేసిన తప్పుల నుంచి బయటపడతారు. ఉద్యోగులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . ఈ రాశి వారు నైపుణ్య ప్రదర్శించడం ద్వారా ఉద్యోగులు అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వ్యాపారులు భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేస్తారు. కుటుంబ సభ్యులకు శుభవార్తలు అందుతాయి. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఇతరుల చెప్పే మాటలను నమ్మకూడదు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దల సలహా తీసుకోవాలి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారి ఉద్యోగులు ఈరోజు అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులు తమ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. రోజువారి చేసే కార్యకలాపాలకు అడ్డంకులు ఉంటే వెంటనే వాటిని పరిష్కరించుకోవాలి. ఆర్థిక లావాదేవీల్లో ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకోవాలి. విద్యార్థుల పోటీ పరీక్షలకు తల్లిదండ్రుల మద్దతు ఉంటుంది.