River Fish Vs Sea Fish: మాంసాహారం తినాలని అనుకునే వారిలో మటన్, చికెన్ వాటి కన్నా చేపలు చాలా ఆరోగ్యకరమైనవని కొందరు చెబుతూ ఉంటారు. చేపల్లో ఎలాంటి గొప్ప పదార్థం ఉండదు. దీంతో వీటిని తినడం వల్ల ఆరోగ్యమే కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్టు ఉండదని కొందరు చెబుతూ ఉంటారు. అయితే చికెన్ మటన్ కంటే చేపలు తినడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే దీనిని చాలామంది అవాయిడ్ చేస్తారు. కానీ వీకెండ్ కాకపోయినా కొన్ని సందర్భాల్లో ఫిష్ చాలా మంచిది అని చెబుతూ ఉంటారు. అయితే చేపల్లోనూ చెరువు చేపలు మంచివా? సముద్రపు చేపలు మంచివా? అని కొందరికి సందేహం ఉంటుంది. అసలు ఈ రెండిటిలో తేడా ఏముంటుంది?
Also Read: రెమ్యూనరేషన్ విషయంలో యాంకర్ సుమ ని దాటేసిన సుడిగాలి సుధీర్!
చేపలు అన్ని వయసుల వారు తినేందుకు ఆరోగ్యకరం. ఏ చేపల్లోనైనా విటమిన్ డి, ఏ లతోపాటు ఒమేగా 3 యాసిడ్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తినడం వల్ల మెదడు పనితీరు సక్రమంగా ఉంటుంది. రక్త ప్రసరణ మెరుగ్గా ఉండి గుండె పనితీరు బాగుంటుంది. అయితే చేపలు ఎక్కువ శాతం చెరువులో నుంచి వస్తాయని చాలామందికి తెలుసు. సముద్రపు తీరాల్లో ఉన్న ప్రజలు సముద్రపు చేపలని ఎక్కువగా తింటారు. ఎందుకంటే చెరువుల్లో లభించే చేపల కంటే సముద్రంలో లభించే చేపలు అరుదుగా ఉంటాయి అంతేకాకుండా ఇవి అనుకోకుండా లభ్యమవుతాయి. చెరువులో చేపలు మత్స్యకారులు పెంచిన విధంగా ఉంటే.. సముద్రపు చేపలు వివిధ ప్రాంతాల నుంచి కొట్టుకు వస్తాయి.
చెరువుల్లో సాధారణంగా కొర్రమీను లేదా బొమ్మేలు, రవ్వులు, బొచ్చలు వంటివి పెంచుతూ ఉంటారు. నీ చేపల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఫ్యాటు తక్కువగా ఉంటుంది. అలాగే ఇందులో ఫ్లేవర్స్ కూడా తక్కువగా ఉంటాయి. ఈ చేపల్లో ఒమేగా త్రీ యాసిడ్స్ తక్కువగా ఉంటాయి.
సముద్రపు చేపల విషయానికి వస్తే వంజరం తదితర చేపలు లభ్యమవుతూ ఉంటాయి. పెద్ద చేపల్లో కొన్ని కింగ్ ఫిష్ వంటివి ఉంటాయి. ఇలాంటి పెద్ద చేపల్లో ఒమేగా త్రీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటుంది. అయోడిన్ కూడా ఇందులో ఎక్కువగా ఉంటుంది. మళ్లీ ఇందులోనూ సముద్రంలో దొరికే చిన్న చేపల్లో ఒమేగా త్రీ యాసిడ్స్ తక్కువగానే ఉంటాయి.
అయితే ఈమధ్య శుశి అనే చేపదు అందుబాటులోకి వస్తున్నాయి. ఇవి ఉడికించకుండా కేవలం కాల్చి మాత్రమే ఇస్తుంటారు. అయితే ఇలాంటి చేపల్లో వామ్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ వీటిలోనూ ఫ్రోజెన్ ఫిష్ తీసుకోవచ్చు.
మొత్తంగా చెరువు చేపలైనా? సముద్రపు చేపలైనా విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ చేపలు కచ్చితంగా ఉడికించి లేదా ఫ్రోజెన్ వంటి చేపలతో ఎలాంటి నష్టం ఉండదు. అయితే చెరువు చేపల్లో కంటే.. సముద్రపు చేపల్లో ఎక్కువగా ఒమేగా త్రీ యాసిడ్స్ ఉండడం వల్ల ఈ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వీటిని తీసుకోవచ్చు. కానీ ఇతర ప్రాంతాల్లోని వారు మిగతా చెరువు చేపలను తీసుకున్నా.. ఎలాంటి నష్టం ఉండదు. ఓవరాల్ గా చేపలు తినడం అందరికీ ఆరోగ్యకరమైన ఆహారమే.