Today 30 October 2025 Horoscope: జ్యోతిష శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశరాసులపై శ్రవణ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో ఈ రాశి విద్యార్థులు ఈ రోజు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధించడం ఖాయం. ఉద్యోగులు ఆర్థికపరమైన విజయాలు సాధిస్తారు. మేషంతో సహా మీనం వరకు మొత్తం 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు అనుకూలమైన వాతావరణాన్ని పొందుతారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఏవైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల సలహా తీసుకోవడం మంచిది. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఈ సమయం మంచిది కాదు. వ్యాపారులు కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండే ప్రయత్నం చేయాలి. లేకుంటే ఇంట్లోనే శత్రువులు తయారయ్యే అవకాశం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనేందుకు శిక్షణ తీసుకుంటారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం. అయితే కొందరు శత్రువులు అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు అవసరమైన ఆదాయ వానలు అందుతాయి. అధికారుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది. దీంతో మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. దూర ప్రయాణాలు చేసే వారు సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండడమే మంచిది.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు గతంలో కంటే ఇప్పుడు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. దీంతో సంతృప్తిగా ఉంటారు. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులు చేపట్టి బిజీగా మారుతారు. వీరికి తోటి ఉద్యోగుల సహకారం ఉంటుంది. పూర్తిగా ఎవరిని నమ్మకూడదు. విద్యార్థులకు తల్లిదండ్రుల మద్దతు ఉండడంతో పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : . ఈ రాశి వారు వ్యాపార ప్రణాళికలను వేసి విజయవంతంగా ముందుకు వెళ్తారు. కొత్త భాగస్వాములను చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొందరు వీరి పనులకు అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు తోటి వారితో జాగ్రత్తగా మెదలాలి. కొందరు పక్కనే ఉండి మోసం చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉంటాయి. సోదరులతో ఘర్షణ వాతావరణం దిగకుండా ఉండాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాజు వారు ఈరోజు దూర ప్రయాణాలను మానుకోవడమే మంచిది. వ్యాపారులు గతంలో చేపట్టిన కొన్ని ప్రయత్నాలు ఈరోజు పూర్తి చేస్తారు. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే వాదనలు జరిగినప్పుడు మౌనంగా ఉండడమే మంచిది. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగులు అదరపు ఆదాయం పొందడానికి మార్గం ఏర్పడుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి శత్రువుల పెడత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఎవరిని నమ్మకూడదు. ముఖ్యంగా ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయాల్లో అధికారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటారు. అయితే తోటి వారి సహకారంతో అనుకున్న పనులను పూర్తి చేయడంతో కాస్త ఉపశమనం ఉంటుంది. విదేశాల నుంచి శుభవార్తలు విని అవకాశం ఉంటుంది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పాత స్నేహితులను కలవడం వల్ల ఉల్లాసంగా ఉంటారు. ఇష్టమైన ఆహారాన్ని తీసుకోగలుగుతారు. అయితే ఆరోగ్యరీత్యా నాణ్యమైన ఆహారాన్ని మాత్రమే తీసుకునే ప్రయత్నం చేయాలి. పిల్లలతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. విహార యాత్రలకు వెళ్ళేందుకు ప్లాన్ చేస్తారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. గతంలో కొందరి వద్ద ఆగిపోయిన డబ్బు తిరిగి వసూలు అవుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారికి పెద్దల సలహా ఉంటుంది అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. అనుకోకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లల భవిష్యత్తు గురించి కీలక నిర్ణయం తీసుకుంటారు. పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాష్ట్ర విద్యార్థులకు ఈరోజు అన్ని రకాలుగా విజయాలు చేకూరుతాయి. కుటుంబ వివాదాలు ఉంటే తొలగిపోతాయి. సోదరులతో ఉల్లాసంగా ఉంటారు. పెళ్లిళ్లు చేసుకోవాలని అనుకునే వారికి ప్రతిపాదనలు వస్తాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం. పెద్దల సలహాతో గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు వస్తాయి. అదనపు ఆదాయం కోసం ఉద్యోగులు చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ప్రియమైన వారి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అయితే దుబారా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు స్నేహితుల అండ ఉండడంతో కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు అనుకున్న పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. అయితే వ్యాపారులు కొత్తగా ప్రాజెక్టును చేపడతారు. ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. ఉద్యోగులు పదోన్నతిని పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో తోటి వారి సహకారం ఉంటుంది. ఎవరితోనైనా వాదనలు ఉంటే ఓపిక ఉండాలి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని రకాలుగా శుభ ఫలితాలు ఉంటాయి. జీవిత భాగస్వామి కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే వాహనాలపై జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.