spot_img
Homeఆధ్యాత్మికంToday 23 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారు జాగ్రత్త.. జీవితంలో ఊహించని...

Today 23 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారు జాగ్రత్త.. జీవితంలో ఊహించని మార్పులు..

Today 23 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు శుక్ల యోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశుల వారికి అనుకోకుండా శుభ ఫలితాలు ఉండే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారి వ్యక్తిగత ఆదాయం పెరుగుతుంది. శక్తి సామర్థ్యాల మేరకు అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. గతంలో మొదలుపెట్టిన పనులను ఈరోజు పూర్తి చేస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు ప్రత్యర్థులపై కన్నేసి ఉంచాలి.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు అనుకోకుండా అదృష్టం కలిసి వస్తుంది. పిల్లల కెరీర్ విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యాపారులకు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈ రోజు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారులకు తన లాభం ఎక్కువగా ఉంటుంది. కొత్త వ్యక్తులు పరిచయం కావడంతో వారిద్వారా వ్యాపారాన్ని విస్తరిస్తారు. కోర్టు కేసులకు సంబంధించి శుభవార్తలు వింటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు శుభవార్తలో వింటారు. నిరుద్యోగులకు అనేక సంస్థల నుంచి ఆఫర్లు లభిస్తాయి. కొత్తగా ఏదైనా పనిని ప్రారంభించాలి అనుకుంటే దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారులు కార్యకలాపాలలో రాణిస్తారు. దీంతో కొత్త సంబంధాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు ఉంటాయి.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు గణనీయమైన లాభాలు ఉండే అవకాశం ఉంది. ఖరీదైన వస్తువుల కొనుగోలు చేసే విషయంలో పునర్ ఆలోచించాలి. ఉద్యోగులకు తోటి వారి సహకారం ఉండడంతో ముఖ్యమైన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తారు బంధువులనుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారులకు కొత్త భాగస్వాములు పరిచయమవుతారు.

కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు ఆర్థికమైన కార్యకలాపాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అనుకునే వారు కొన్ని రోజులు వెయిట్ చేయడం మంచిది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఉద్యోగులకు ప్రతికూలమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి నిరుద్యోగులకు ఈరోజు శుభవార్తలు అందుతాయి. పిల్లల కెరీర్ విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది. అనుకోకుండా అదృష్టం వరించడం వల్ల కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. కొత్త వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నాణ్యమైన సమయాన్ని పిల్లలతో గడుపుతారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు ఏ పని మొదలుపెట్టిన దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మాటల మాధుర్యంతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. ఉద్యోగులు తోటి వారి సహకారంతో ముఖ్యమైన ప్రయోజనం పూర్తి చేస్తారు. పెట్టుబడులా విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు తొందరపడవద్దు. పెద్దల సలహా తీసుకోవాలి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. పెద్దల అండదండలతో కొత్తగా పెట్టుబడులు పెడతారు. గతంలో అనుకున్న ముఖ్యమైన పనులను ఈరోజు పూర్తి చేస్తారు. ఉద్యోగులకు అధికారుల నుంచి సపోర్టు ఉండటంతో అధిక ఆదాయాన్ని పొందుతారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు అనవసరపు ఖర్చులు వెంటాడుతాయి. ఆర్థికంగా తీవ్ర సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రయాణాలు చేసే ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు ఏర్పడతాయి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు పెండింగ్ పనులను పూర్తి చేయగలుగుతారు. అయితే కొన్ని పనులు పూర్తి చేయడానికి ఇతరుల సహకారం తీసుకోవాలి. ఉద్యోగులు తోటి వారితో సంతోషంగా గడుపుతారు. అధికారుల సపోర్టుతో కొందరు పదోన్నతులు పొందే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు డబ్బు పొదుపు చేయడంలో ఆసక్తి చూపుతారు. సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లడం వల్ల ఆర్థికంగా విజయం సాధిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనడానికి అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

AP Rain Alert

AP Rain Alert: ఏపీకి చల్లటి కబురు.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: ఏపీకి చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈరోజు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని చెప్పింది. పిడుగులతో కూడిన వానలు పడతాయని...
Bhogapuram International Airport

Bhogapuram International Airport: భోగాపురం విమానాశ్రయం ప్రారంభం.. విద్యార్థులకు బంపర్ ఆఫర్!

Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జాతికి అంకితం కానుంది. ఈనెల 1న ప్రారంభోత్సవానికి నోచుకోనుంది. అందుకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు....
Balakrishna

Balakrishna: బాలయ్య కి ఫోన్ చేసిన ఎన్టీఆర్… ఇంటికి కూడా వెళ్తున్నాడుగా…

Balakrishna: సినిమా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ ఉన్నంత మాత్రాన సక్సెసులైతే రావు... స్టార్ డమ్ అనేది లభించదు. వాళ్ల సత్తాను చూపించి ప్రేక్షకులను మెప్పించగలిగితేనే వాళ్ళకంటూ ఒక ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. లేకపోతే మాత్రం...
Talliki Vandanam Scheme

Talliki Vandanam Scheme: తల్లికి వందనం అందలేదా.. ఇలా చేయండి!

Talliki Vandanam Scheme: ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది వరకు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలు జమ కానున్నాయి....
CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
Oktelugu Epaper