Today 21 July 2025 Horoscope: గ్రహాల మార్పు కారణంగా కొన్ని రాశులపై ప్రభావం ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై రోహిణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణ ఉండనుంది. మేషం నుంచి మీనం వరకు మొత్తం 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఉద్యోగులు ఈరోజు అధికారులతో వేధింపు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల ఏదైనా పనిని మొదలు పెడితే జాగ్రత్తగా పూర్తి చేయాలి. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే భాగస్వాములతో చర్చించాలి. లేకుంటే విభేదాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఓ చర్చ వివాదానికి దారితీస్తుంది. అయితే దీనిని వెంటనే పరిష్కరించుకుంటారు. విద్యార్థులు శుభవార్తలు వినయ్ అవకాశం ఉంది.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : జీవిత భాగస్వామితో వ్యాపారం తీసేవారు లాభాలు పొందుతారు. స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. కొన్ని వివాదాలకు దూరంగా ఉండటమే మంచిది. కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అయితే ప్రశాంత వాతావరణన్ని ఏర్పాటు చేసుకోవాలి. కుటుంబ సభ్యులతో కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యార్థులు భవిష్యత్తు గురించి కీలక నిర్ణయం తీసుకుంటారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఉద్యోగులు అదనపు బాధ్యతలు చేపడతారు. వీటిని సమర్థవంతంగా పూర్తి చేస్తే అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వ్యాపారులు కొత్త వ్యాపారం గురించి ఆలోచిస్తారు. వీరికి తోటి వారి సహకారం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. సొంత వాహనాలపై వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. పూర్వీకుల ఆస్తి కి సంబంధించి సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ప్రియమైన వారికోసం కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు. అయితే ఈ సమయంలో ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. అయితే ఏ చిన్న వివాదం ఏర్పడిన వెంటనే పరిష్కరించుకోవాలి. పెద్దల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. దూర ప్రయాణాలు చేస్తే పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కొన్ని రోజుల్లో నిర్వహించే శుభకార్యం కోసం చర్చించుకుంటారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి విద్యార్థులు తమ పోటీ పరీక్షల గురించి తల్లిదండ్రులతో చర్చిస్తారు. ఉద్యోగులకు అదనంగా ఆదాయం పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది. నిరుద్యోగులు ఓ కంపెనీ నుంచి శుభవార్త వింటారు. ప్రశాంతమైన వాతావరణంలో గడిపేందుకు ప్రయత్నించాలి. లేకుంటే మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొందరు వ్యక్తుల వల్ల సమస్యలు ఏర్పడతాయి. అందువల్ల సాధ్యమైనంత వరకు కొత్త వారితో దూరంగా ఉండాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : వ్యాపారులు తీసుకుని నిర్ణయాలతో లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసేవారికి ఈరోజు సువర్ణ అవకాశం లభించనుంది. ఉద్యోగులకు అనుకున్న దానికంటే ఎక్కువగా ఆదాయం పొందేందుకు అవకాశం ఉంటుంది. ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆహారం విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు లక్ష్యాన్ని చేరుకోవడానికి తీవ్రంగా కష్టపడతారు. అయితే స్నేహితులతో కలిసి ప్రయాణం చేస్తే జాగ్రత్తగా ఉండాలి. వీరిలో ఒకరితో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. పెద్దల ఆరోగ్యాన్ని కాపాడే ప్రయత్నం చేయాలి. విద్యార్థుల పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . కొన్ని సవాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వివిధ రంగాల్లో ఉన్నవారికి గుర్తింపు లభిస్తుంది. డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు వెతుక్కుంటారు. వీరిలో ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు భవిష్యత్తు గురించి తీసుకునే నిర్ణయం తీరకంగా ఉంటుంది. గతంలో చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. చట్టపరమైన చిక్కుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఏదైనా కాంపిటీషన్లో పాల్గొంటే అందులో విజయం సాధించే అవకాశం ఉంటుంది. వ్యాపారం కోసం ప్రయాణాలు చేస్తారు. ఇది భవిష్యత్తులో లాభాలను తీసుకొస్తాయి. ఉద్యోగులు జీవిత భాగస్వామితో అదనపు ఆదాయం గురించి చర్చిస్తారు. ఇంట్లో ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . ఈ రాశి వారు కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అందువల్ల వ్యాపారులు కొత్త భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. పిల్లల ఆరోగ్యం పై ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈరోజు ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెద్దల సలహాతో పెట్టుబడులు పెట్టాల్సి వస్తే భాగస్వాములతో చర్చించాలి. రాజకీయాల్లో ఉండే వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వీరికి సమాజంలో గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన ప్రతి పని విజయం సాధిస్తారు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.