Kingdom Samrajya Movie: విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కింగ్డమ్'(Kingdom Movie) ఈ నెల 31 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అయితే విడుదల తేదీని ఒక చిన్న ప్రోమో ద్వారా మేకర్స్ తెలియజేసారు. ఆ సమయం లో వాళ్ళు కేవలం తెలుగు, తమిళ వెర్షన్స్ కి సంబంధించిన ప్రోమోలను మాత్రమే విడుదల చేశారు. దీంతో విజయ్ దేవరకొండ కి మంచి మార్కెట్ ఉన్న హిందీ లో ఈ చిత్రం విడుదల అవ్వడం లేదా అని సోషల్ మీడియా నెటిజెన్స్ మేకర్స్ ని ట్యాగ్ చేసి ప్రశ్నించారు. అయితే రీసెంట్ గా ఆ చిత్ర నిర్మాత నాగవంశీ ఇచ్చిన ఇంటర్వ్యూ లో దీనిపై క్లారిట్రీ ఇచ్చాడు.
ఆరోజు మేము కేవలం రెండు భాషలకు సంబంధించిన ప్రోమోలను విడుదల చేసేలోపు అందరు హిందీ లో విడుదల కావడం లేదని అనుకున్నారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. ఈ చిత్రం హిందీ లో విడుదల అవుతుందని చెప్పుకొచ్చాడు. ఆ రోజున హిందీ ప్రోమో రిలీజ్ చేయకపోవడానికి ముఖ్య కారణం టైటిల్ సమస్య వల్లే అని ఆయన క్లారిటీ ఇచ్చాడు. హిందీ లో అదే టైటిల్ తో వేరే ప్రొడక్షన్ టీం రిజిస్టర్ చేయించుకుందని, అందుకే వేరే టైటిల్ కోసం ఆగమని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు హిందీ లో ఈ చిత్రానికి ‘సామ్రాజ్య’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్టు తెలుస్తుంది. కింగ్డమ్ అంటే తెలుగు లో, హిందీ లో ఒకే అర్థం, అదే సామ్రాజ్యం. హిందీ కాబట్టి సామ్రాజ్య అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని ఇప్పటికే ఓవర్సీస్ లోని నార్త్ అమెరికా ప్రాంతం లో ప్రారంభించారు.
ఈ బుకింగ్స్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కేవలం 200 షోస్ మీద 42 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. సినిమా విడుదల తేదీ దగ్గరకు వచ్చేసరికి కచ్చితంగా ఈ చిత్రం హాఫ్ మిలియన్ కి పైగా ప్రీమియర్స్ ని రాబడుతుందని, విజయ్ దేవరకొండ కెరీర్ లో ది బెస్ట్ గా నిలిచిపోతుందని అంటున్నారు. ఇది ఎంత వరకు నిజం అవ్వబోతుందో చూడాలి. ఈ నెల 24 ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయబోతున్నారు. ఈ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి వచ్చే రెస్పాన్స్ ని బట్టే ఈ చిత్రానికి ఎంత ఓపెనింగ్ వస్తుంది అనేది అంచనా వెయ్యగలం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. వరుస ఫ్లాప్స్ లో ఉన్న విజయ్ దేవరకొండ కు ఈ చిత్రం సక్సెస్ అవ్వడం అత్యంత అవసరం.