spot_img
Homeఆధ్యాత్మికంToday 20 March 2026 Horoscope: ఈ రాశుల వారి ఇంట్లో ఈరోజు లక్ష్మి తాండవం.

Today 20 March 2026 Horoscope: ఈ రాశుల వారి ఇంట్లో ఈరోజు లక్ష్మి తాండవం.

Today 20 March 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై రేవతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మరికొన్ని రాశుల వారు వివాదాలకు దూరంగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు కొన్ని ఆటంకాలు ఎదుర్కోవచ్చు. ప్రాజెక్టులు పూర్తి కావడానికి ఒకటి వారి మద్దతు చాలా అవసరం. ఆర్థికపరంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారులకు లాభాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : గతంలో కంటే ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారులతో కుటుంబ సభ్యుల మధ్యతండడంతో అధిక లాభాలు అందుతారు. ఆన్లైన్లో పెట్టుబడులు పెట్టిన వారికి ఈరోజు లాభాలు ఉంటాయి. ఇతరుల వద్ద అప్పు చేయకుండా ఉండాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఉద్యోగులకు కార్యాలయాల్లో వేధింపులు ఉంటాయి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సూర్యుడు అనుగ్రహం వల్ల ఊహించని ఖర్చులు ఉంటాయి. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. రాజకీయ నాయకులకు ప్రత్యర్థుల బెడద ఎక్కువగా ఉంటుంది. మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఉద్యోగులు ఈరోజు అధిక ప్రయోజనాలను పొందుతారు. వ్యాపారులకు తోటి వారి మద్దతు ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. ఆగిపోయిన పనులను ఈరోజు పూర్తి చేస్తారు. ఇతరుల వద్ద నిలిచిపోయిన డబ్బు వసూలు అవుతుంది.
.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈరోజు ఈ రాశి వారు అవసరమైనంత మేరకు మాత్రమే మాట్లాడాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టే ముందు పెద్దలను సంప్రదించడం మంచిది. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగులు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అధికారుల నుంచి ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండాలి.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని కొత్తగా పెట్టుబడులు పెడతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. అనుకోకుండా దూరప్రాయణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగులు గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకుంటారు. అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు శత్రువులపై విజయం సాధిస్తారు. ఈరోజు అన్ని శుభాలే జరిగే అవకాశం ఉంది. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులు పెద్దల సలహాతో కొత్తగా పెట్టుబడులు పెడతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు చాలా ఉత్సాహంగా గడుపుతారు. మనసులో ఏది అనుకుంటే అది పూర్తి చేసే వరకు వదలరు. దీంతో శుభకార్యం జరిగే అవకాశం ఉంటుంది. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. వ్యాపారులు కుటుంబ సభ్యుల సహాయంతో లాభాలు పొందుతారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఉద్యోగులు ఈరోజు అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆగిపోయిన పనులను పూర్తి చేయడానికి కృషి చేస్తారు. విద్యార్థుల నైపుణ్యంతో పై చదువుల కోసం అవకాశం ఏర్పడుతుంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు వివాదాలకు దూరంగా ఉండాలి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయి. పిల్లలతో సరదాగా నడుపుతారు. స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో సకాలంలో పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఉద్యోగులకు సానుకూలమైన ఫలితాలు ఉండనున్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. మిత్రుల సలహా మేరకు అప్పులను తీరుస్తారు. భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని పెట్టుబడులు పెడతారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular