Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల మార్పుతో రాశులపై ప్రభావం పడనుంది. దీంతో కొన్ని రాశులు కలిగిన జీవితాల్లో ఊహించని సంఘటనలు ఎదురుకానున్నాయి. ఈ నేపథ్యంలో మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) :వ్యాపారులు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. ఉద్యోగులకు ఈరోజు అన్ని రకాల అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఇతరుల వద్ద ఆగిపోయిన డబ్బులు తిరిగి వస్తుంది. దీంతో ఈరోజు ఉల్లాసంగా ఉంటారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : వ్యాపారులు బిజీగా మారుతారు. కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. దీంతో వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసేవారికి ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉండాలి. ఉద్యోగులు కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేయడం వల్ల అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈరోజు పాత మిత్రులను కలవడం వల్ల సంతోషంగా గడుపుతారు. ఆదాయం పెరిగినా.. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. ఇతరులకు డబ్బు ఇచ్చేటప్పుడు ఆలోచించాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దల సలహా తీసుకోవాలి. కొన్ని విషయాల్లో సాయం చేయడానికి స్నేహితులు వెనుకడుగు వేస్తారు. వ్యక్తిగత సమస్యలు వెంటాడుతాయి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : వ్యాపారులు బిజీగా మారిపోతారు. కొత్త ప్రాజెక్టులు చేపట్టడంతో ఉద్యోగుల సైతం తీరికలేకుండా గడుపుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల కోసం ఆరాట పడతారు. కొందరి బంధువుల వల్ల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే వీటిని పరిష్కరించేందుకు జీవిత భాగస్వామి అండ ఉంటుంది.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యాపారులకు అన్ని రకాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. దీంతో ఊహించిన దాని కంటే ఎక్కువ లాభాలు పొందుతారు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు ఈరోజు పూర్తి చేస్తారు. దీంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఆర్థిక వ్యవహారాలు అనుకున్న స్థాయిలో ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిసి చేసే వ్యాపారం అభివృద్ధిలోకి వస్తుంది. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. కుటుంబ సభ్యుల మధ్య శుభకార్యం గురించి చర్చ జరుగుతుంది. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈరోజు వారు ఈరోజు శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులను చేపడతారు. కొందరు స్నేహితులు మోసం చేసే అవకాశం ఉంది. అందువల్ల ఎవరికి ఇంట్లోని విషయాలు చెప్పకుండా ఉండడమే మంచిది. నాణ్యమైన ఆహారాన్ని తీసుకుని ప్రయత్నం చేయాలి. ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) :. ఉద్యోగుల పనితీరు నచ్చడంతో అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. ఎవరికైనా డబ్బు ఇస్తానని మాట ఇవ్వకూడదు. అలా ఇస్తే తిరిగి ఇచ్చేదాకా వెంట పడతారు. బ్యాంకు రుణాలు వచ్చే అవకాశం ఉంది. అనుకున్న స్థలంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఆర్థికంగా అనుకూలమైన వాతావరణం ఉండనుంది. ధన నష్టం ఉండే అవకాశం ఉంది. అందువల్ల ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి డబ్బు ఇవ్వకపోవడమే మంచిది. పెండింగ్లో ఉన్న డబ్బు వసూలు అవుతుంది. వ్యాపారులు కొత్త పెట్టుబడుల గురించి ఆలోచిస్తారు. ఉద్యోగులకు అన్ని రకాలైన సానుకూల వాతావరం ఉండనుంది.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి బంధువుల నుంచి ధన సహాయమందుతుంది. జీవిత భాగస్వామితో ఈరోజు సంతోషంగా ఉండగలుగుతారు. వ్యాపారులకు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. విద్యార్థుల పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశాలనుంచి శుభవార్తలు విని అవకాశముంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఎదుటివారితో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరపు వివాదాల్లోకి తల దూర్చొద్దు. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు. దుబారా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఊహించిన దానికంటే ఎక్కువగా ఆదాయం పోతుంది. ఇలాంటి సమయంలో పొదుపు చేయడం నేర్చుకోవాలి. పెద్దల సలహాలతో కొత్తపెట్టబడులు పెడతారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈరోజు వారికి ఈరోజు అనుకూలమైన వాతావరణము ఉండనుంది. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఫలితంగా అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లాలని అనుకునే విద్యార్థులు శుభవార్తలు వింటారు. తోటి వారి సహాయంతో వ్యాపారులు నష్టాల నుంచి గట్టెకుతారు.