Devara 2: #RRR వంటి భారీ గ్లోబల్ బ్లాక్ బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) కొరటాల శివ తో చేసిన ‘దేవర'(Devara Movie) చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకు ఆరంభం లో కాస్త డివైడ్ టాక్ వచ్చినప్పటికీ, ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రాన్ని నచ్చడంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఎవ్వరూ ఊహించని వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమాలో కథ చాలా వీక్ అని, కేవలం ఎన్టీఆర్ నటన, డ్యాన్స్, అనిరుద్ అందించిన అద్భుతమైన పాటలు, సినిమాలో ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఇలా అన్ని కలిసి రావడం వల్లే సినిమా సూపర్ హిట్ అయ్యిందని, పార్ట్ 2 కి అవసరమయ్యే స్టోరీ ఇందులో లేదని, ఒకవేళ రెండవ భాగం తీస్తే చాలా రొటీన్ స్క్రీన్ ప్లే లాగా అనిపిస్తుందని విశ్లేషకులు చెప్పుకొచ్చారు.
Also Read: తెలుగు సినిమాల్లో ఒక్కప్పటి ఫార్ములాను మళ్ళీ వాడుతున్నారా..?
అయితే గత రెండు మూడు రోజుల నుండి ఈ సినిమా ఆగిపోయింది అంటూ సోషల్ మీడియా లో వస్తున్న రూమర్స్ ని మనమంతా చూస్తూనే ఉన్నాం. ‘వార్ 2’ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద వర్కౌట్ అవ్వకపోవడం వల్లే, ‘దేవర 2’ కూడా వర్కౌట్ అయ్యే సినిమా కాదని, సెట్స్ మీదకు వెళ్లే ముందే ఈ సినిమాని ఆపేస్తే బెటర్ అని ఎన్టీఆర్ ఒక నిర్ణయం తీసుకొని కొరటాల శివ కి చెప్పడం, అందుకు కొరటాల శివ కూడా ఓకే చెప్పి, దేవర స్క్రిప్ట్ పేపర్స్ ని పక్కన పెట్టి, నాగ చైతన్య తో కొత్త సినిమా చేయడానికి చర్చలు జరుపుతున్నాడని వార్తలు రావడం సోషల్ మీడియా లో గత రెండు మూడు రోజులుగా హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఈ ప్రచారం మేకర్స్ వరకు వెళ్లడం తో, వాళ్ళు కాసేపటి క్రితమే క్లారిటీ.
అందరూ అనుకుంటున్నట్టుగా ‘దేవర 2’ ఆగిపోలేదు. స్క్రిప్ట్ వర్క్ డైలాగ్ వెర్షన్ తో సహా లాక్ అయిపోయిందని, త్వరలోనే ఈ క్రేజీ చిత్రం సెట్స్ మీదకు వెళ్తుందని చెప్పుకొచ్చారు. అయితే ఈ సీక్వెల్ కి ప్రస్తుతానికి అయితే ఎలాంటి హైప్, క్రేజ్ ఏర్పడదు అనడం లో ఎలాంటి సందేహం లేదు. బహుశా అభిమానులు ఈ సీక్వెల్ కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు, కానీ సాధారణ ఆడియన్స్ మాత్రం ఈ చిత్రం కోసం అసలు ఎదురు చూడరు. దానికి తోడు ‘దేవర’ కి కుదిరినట్టుగా మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు కుదురుతుందో లేదో చూడాలి. ‘బాహుబలి 2’, ‘పుష్ప 2’, ‘సలార్ 2’, ‘KGF 2’ రేంజ్ హైప్ అయితే ఈ సినిమాకు కచ్చితంగా ఏర్పడదు అని చెప్పడమ్ లో ఎలాంటి అతిశయోక్తి లేదు.