Today 2 September 2025 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మరి కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు ఈరోజు కొన్ని కొత్త పనులపై ఆసక్తి చూపుతారు. వ్యాపారులు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి సిద్ధం చేసుకుంటారు. కుటుంబ సభ్యుల మద్దతుతో లాభాలు పొందుతారు. ఎవరితోనైనా విభేదాలు ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలి. ఇంటికి సంబంధించిన రహస్యాలను ఇతరులకు చెప్పొద్దు. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. గతంలో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : జీవిత భాగస్వామితో వ్యాపారం చేసే వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. వ్యాపారులు కీలకమైన నిర్ణయం తీసుకుంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. ఉద్యోగులు పదోన్నతి పొందడానికి ఇదే మంచి అవకాశం. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఉద్యోగులు లక్షాన్ని పూర్తి చేయడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. వ్యాపారులకు వచ్చిన లాభాలను పంచడంలో విజయం సాధిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మాటలను అదుపులో ఉంచుకోవాలి. విహార యాత్రలకు వెళ్లాలని ప్లాన్ చేసేవారికి స్నేహితుల మద్దతు ఉంటుంది. వ్యాపారులకు ఊహించిన లాభమే ఉంటుంది.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఉద్యోగులు తమ నైపుణ్యాలను ప్రదర్శించడం ద్వారా అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్య కొన్ని విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. స్నేహితులతో కలిసి కొత్త పెట్టుబడులు పెడతారు. అయితే ఈ సమయంలో పెద్దల సలహా కూడా తీసుకోవాలి. కొందరు తప్పు దోవ పట్టించే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు లక్ష్యాన్ని పూర్తి చేయడంలో బిజీగా మారిపోతారు. ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం పై ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు. పెండింగు పనులను పూర్తి చేసుకోవాలి. గతంలో ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వస్తే ఆలోచించాలి. గతంలో చేపట్టిన కొన్ని పనులను పూర్తి చేయడానికి ఆసక్తి చూపుతారు. వ్యాపారులు బడ్జెట్ విషయంలో బంధువులను సంప్రదిస్తారు. ఆన్లైన్లో పెట్టుబడులు పెట్టే వారికి లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త పరిచయాలతో వ్యాపారులకు లాభాలు ఉంటాయి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని పనులను పూర్తి చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కొత్తగా పనిని ప్రారంభించే వారు పెద్దల సలహా తీసుకోవాలి. విహారయాత్రలకు వెళ్లాలని అనుకునేవారు ప్లాన్ చేస్తారు. ఉద్యోగులు లక్ష్యాలు పూర్తి చేయడంతో ప్రశంసలు పొందుతారు. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో వ్యాపారాలు నిర్వహించే వారికి లాభాలు ఉంటాయి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ముఖ్యమైన పనులు వాయిదా వేయకుండా ఉండడమే మంచిది. ఉద్యోగులు కార్యాలయాల్లో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఆరోగ్యం పై నిర్లక్ష్యంగా ఉండకుండా సరైన నిర్ణయం తీసుకోవాలి. బ్యాంకు నుంచి రుణం తీసుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఇవి ఉద్యోగులకు లాభం చేకూరుతాయి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : వ్యాపారులు ఇలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో పెట్టిన పెట్టుబడులకు లాభాలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. అర్హులైన వారికి వివాహ ప్రయత్నాలు జరుగుతాయి. తల్లిదండ్రులతో కలిసిమెలిసి ఉంటారు. పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) . ఈ రాశి వారు ఈరోజు కొత్త ప్రణాళికలు చేపడతారు. వ్యాపారులకు అనుకూలమైన వాతావరణ ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభిస్తే అందులో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు అవకాశాలు వస్తాయి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన పనులపై శ్రద్ధ వహించాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వివాహ ప్రయత్నాలు జరుగుతాయి. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. సొంత వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . వ్యాపారులు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. ఉద్యోగులకు సరైన అవకాశాలు అందుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.