Homeజాతీయం - అంతర్జాతీయంSCO Summit: పాక్ ప్రధానిని చైనా పిలిచింది ఇందుకా.. మూలన కూర్చోబెట్టారు కదరా. ఇజ్జత్ పోయింది...

SCO Summit: పాక్ ప్రధానిని చైనా పిలిచింది ఇందుకా.. మూలన కూర్చోబెట్టారు కదరా. ఇజ్జత్ పోయింది పో

SCO Summit: ఇది మామూలు పరాభవం కాదు.. ఇజ్జత్ పోయింది. కనీసం ఎవరూ దేకలేదు. దగ్గరికి వెళ్తే గాని దగ్గరికి తీసుకోలేదు. అలాగని వ్యూహాత్మక వాణిజ్యం గురించి మాట్లాడలేదు. పెట్టుబడుల గురించి చర్చించలేదు. ఆసియాలో అది ఒక దేశం కాబట్టి.. అక్కడ కూడా జనం ఉంటారు కాబట్టి.. తప్పనిసరి పరిస్థితుల్లో పిలిచారు కాబట్టి ఆ దేశ ప్రధాని వెళ్లిపోయాడు. అంటే తప్ప ఆయనకేదో ఘన స్వాగతం పలకలేదు. ఎదురేయి చైనా అధ్యక్షుడు వచ్చి పుష్పగుచ్చం అందించలేదు. కనీసం ఫోటో కూడా దిగడానికి ఆసక్తి చూపించలేదు. ఎక్కడ ఫోటో దిగితే డబ్బులు అడుగుతాడని భయంతో రష్యా అధినేత కూడా దూరం పెట్టాడు. ఒక రకంగా సెక్యూరిటీ గార్డ్ కంటే (ఇక్కడ సెక్యూరిటీ గార్డులు క్షమించాలి) హీనంగా మారిపోయింది అతని బతుకు. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకు జరుగుతుందో తెలియదు. ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు. ఎందుకోసం మాట్లాడుతున్నారో తెలియదు. అదేదో సినిమాలో చికెన్ బిర్యాని పెడతానంటే వచ్చాం. తినేసి వెళ్ళిపోతున్నాం అన్నట్టుగా అతని పరిస్థితి మారిపోయింది. ఇంతటి ఉపోద్ఘాతం చదివిన తర్వాత మీకు ఇప్పటికే స్ట్రైక్ అయిందనుకుంటా.. ఎస్.. ఇంతసేపు మీరు చదివింది పాకిస్తాన్ గురించి. ఆ దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి గురించి.

Also Read: ఫర్ సప్పోజ్ కవిత ప్లేసులో ఇంకో నాయకుడు ఉంటే కెసిఆర్ ఏం చేసేవారు?

చైనాలో షాంగై కోఆపరేటివ్ సదస్సు జరుగుతోంది కాబట్టి డ్రాగన్ దేశ అధ్యక్షుడు పాకిస్తాన్ ప్రధాని ని ఆహ్వానించాడు. ఇప్పుడు మన దేశం తో కొంతలో కొంత మైత్రి కుదిరింది కాబట్టి పాకిస్థాన్ అవసరం చైనాకు లేదు. రష్యాకు ఏమాత్రం అవసరం లేదు. భారత్ చమురు కొన్నంతవరకు రషకు డోకా లేదు. అందువల్లే భారత్ చెప్పింది మొత్తం చైనా విన్నది. చివరికి రష్యా కూడా విన్నది. అంతకు మించిన ప్రత్యామ్నాయం ఆ రెండు దేశాలకు లేదు. అందువల్ల పాకిస్తాన్ తో ఈ రెండు దేశాలకు అవసరం లేదు. ఫలితంగానే దాయాది దేశాన్ని డ్రాగన్, పుతిన్ పరిపాలిస్తున్న దేశం దూరం పెట్టాయి.. భారత్ ధోరణి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి.. ఇక్కడ ప్రస్తావన అనవసరం.

చైనా దేశంలో పాకిస్తాన్ ప్రధానికి జరిగిన ఘోరమైన అవమానంపై సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదని.. ఇటీవలి కాలంలో ఒక దేశ ప్రధానికి ఈ స్థాయిలో దారుణమైన అవమానం జరిగి ఉండదని సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు..”అధికారికంగా గొప్ప స్వాగతం లభించలేదు. చర్చల్లో భాగస్వామ్యం దక్కలేదు. ఏదో చుట్టపు చూపుగా వచ్చాడు. పెట్టింది తిని వెళ్లిపోయాడు. వచ్చి రావడానికి ఫ్లైట్ ఖర్చులు దండగ. కనీసం ఈ డబ్బులు మిగిలి ఉంటే పాకిస్తాన్ ప్రజలకు కొంతలో కొంత అపరిమితమైన పన్నుల భారం నుంచి ఉపశమనం లభించి ఉండేదని” నెటిజన్లు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా పాకిస్తాన్ దేశస్తులు వాస్తవ పరిస్థితిని గ్రహించాలని.. ప్రధానికి గౌరవం లేనిచోట ఆత్మభిమానం.. ఇంకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదని హితవు పలుకుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version