Today 19 November 2025 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై స్వాతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు పదోన్నతి లభించే అవకాశం ఉంది. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు ఉంటాయి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వ్యాపారులు ఈరోజు లాభాలు పొందే అవకాశం ఉంది. సమాజంలో వీరికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు అవకాశాలు ఉంటాయి. అనుకోకుండా శుభ కార్యక్రమంలో పాల్గొంటారు. బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఉద్యోగులు పదోన్నతి గురించి శుభవార్త వింటారు. కుటుంబ సభ్యుల తో కలిసి విహారయాత్రలకు వెళ్తారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఏ రోజు ప్రత్యేక కార్యక్రమాలపై దృష్టి పెడతారు. పెండింగ్ పనులను పూర్తి చేయగలుగుతారు. ఇతరుల వద్ద ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. ఎవరికైనా డబ్బు ఇస్తే ఆలోచించాలి. పరిస్థితిలో అనుకూలంగా ఉండడంతో వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటే పెద్దల సలహా తీసుకోవడం మంచిది. ఉద్యోగులు అనుకున్న పనులను పూర్తి చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. వీరికి సీనియర్ల మద్దతు ఉండడంతో కొంతవరకు బెనిఫిట్స్ ఉంటాయి. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. దీంతో వ్యాపారులు లాభాలను పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు పిల్లల భవిష్యత్తు గురించి కీలక నిర్ణయం తీసుకుంటారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి కోసం కొత్తగా వస్తువులను కొనుగోలు చేస్తారు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. ప్రత్యర్థులపై విజయం సాధించడంతో వ్యాపారులు విల్లాసంగా ఉంటారు. ఆర్థిక వ్యవహారాలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు బిజీ షెడ్యూల్ కారణంగా తీరికగా ఉండదు. జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు కార్యాలయాలు అనుకున్న పనులను పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వ్యాపారులకు కొన్ని అంతరాయాలు కలుగుతాయి. ఇలాంటి సమయంలో ఓర్పు వహించడం మంచిది. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంట్లో ఏదైనా వాదన జరిగితే మౌనంగా ఉండటమే మంచిది. ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకపోవడమే మంచిది. స్నేహితులు ఒకరి ప్రవర్తన తేడాగా ఉంటుంది. ఇలాంటి సమయంలో వారితో జాగ్రత్తగా వెళ్లాలి. ఉద్యోగులకు ఈరోజు అదనపు ఆదాయం మనదే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి కొన్ని నిరాశకరమైన వార్తలు అందుతాయి. సామాజిక సేవలో ఉండడం వల్ల గుర్తింపు లభిస్తుంది. కొన్ని పనులను పూర్తి చేయడంతో సంతృప్తి కలుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగులు పదోన్నతి కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. వ్యాపారులు కొత్తగా ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. వీరికి కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : మీరు రాశి వారికి ఈ రోజు అన్ని రంగాల్లో కలిసి రావడం వల్ల అనుకున్న పనులు పూర్తి అవుతాయి. వ్యాపారులు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. ఆరోగ్యం గతంలో కంటే మెరుగుపడుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఉద్యోగులకు తోటి వారి మద్దతు ఉండడంతో ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈరోజు గణనీయమైన లాభాలు పొందే అవకాశం ఉంది. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. జీవితంలో ఎన్నో సంతోషాలను పొందేందుకు అనేక రకమైన పనులు చేస్తారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణ ఉంటుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరి నుంచి ప్రతికూల వాతావరణ ఉంటుంది. ఇలాంటి సమయంలో సంయమనం పాటించాలి. అనవసరమైన వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండడమే మంచిది. ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు గణనీయమైన లాభాలు ఉంటాయి. దీంతో అప్పులు తీరిపోయే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు కొత్త అవకాశాలు లభించడంతో సంతృప్తిగా ఉంటారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. పిల్లల వివాహానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . ఈ రాశి వ్యాపారులు ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో కొత్త వారితో జాగ్రత్తగా ఉండాలి. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. తెలివితేటలు ఉపయోగించడం వల్ల విద్యార్థులు పోటీపరీక్షలో పాల్గొంటారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది.