Mahesh Babu Varanasi: మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ సినిమా తెరకెక్కుతుంది. ఈ మూవీ ఇప్పటికే మూడు షెడ్యూల్స్ ని కంప్లీట్ చేసుకుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు రాజమౌళితో పాటు మహేష్ బాబు ఈ సినిమా మీద స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు ఐదు డిఫరెంట్ పాత్రల్లో కనిపించబోతున్నాడు అంటూ గతంలో రాజమౌళి ఒక హింట్ ఇచ్చాడు. ఇక దానికి తగ్గట్టుగానే అందులో ఒకటి రాముడు పాత్ర కాగా, మిగతా నాలుగు పాత్రలు ఏంటి అనే విషయం మీద ఇండస్ట్రీ వర్గాల్లో చర్చలైతే జరుగుతున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారమైతే మహేష్ బాబు ఒక విలన్ పాత్రను కూడా పోషించబోతున్నట్టుగా తెలుస్తుంది.
మరి ఆ పాత్ర ఎక్కడ వస్తుంది? ఎలా ఉండబోతుంది? అనేది ప్రతి ఒక్కరిలో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక ఇలాంటి సందర్భంలోనే ఇప్పుడు మహేష్ బాబు నుంచి వస్తున్న ఈ సినిమాతో అతను పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్ లెవెల్ కి వెళ్తున్నాడు… ఐదు డిఫరెంట్ పాత్రల్లో కనిపిస్తున్న మహేష్ బాబు ఇందులో విలన్ పాత్రని పోషిస్తున్నాడు.
ఇక పాత్ర చేయడానికి తను కొంతవరకు ఇబ్బంది పడుతున్నారట. ఎందుకంటే తన అభిమానులు తనని ఎలా రిసీవ్ చేసుకుంటారనే దానిమీదనే సర్వత్ర ఆసక్తైతే నెలకొంది. మొత్తానికైతే మహేష్ బాబు ను రాజమౌళి డిఫరెంట్ గా ప్రజెంట్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. తను అనుకున్నట్టుగా జరిగితే మాత్రం సినిమా ఇండస్ట్రీ లోనే పెను ప్రభంజనాన్ని సృష్టించిన సినిమాగా నిలుస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ గొప్ప గుర్తింపు సంపాదించినవే కావడం విశేషం…ఇక ఈ సినిమాతో ఆయన ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తాడు. తద్వారా ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…చూడాలి మరి ఈ సినిమా ప్రపంచంలోనే టాప్ రేంజ్ సినిమాల్లో ఒకటిగా నిలుస్తుందా లేదా అనేది…