IND A Vs OMAN A: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో మంగళవారం రాత్రి కీలక పరిణామం చోటుచేసుకుంది. గెలవాల్సిన చోట టీమిండియా కు ఊహించని ఫలితం వచ్చింది. దీంతో ఈ టోర్నీ మరింత రసవత్తరంగా మారింది. ఇప్పటికే ఈ టోర్నీలో పాకిస్తాన్ సెమీఫైనల్ వెళ్ళింది. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఒమన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ఒమన్ జట్టులో హమద్ మీర్జా (32), వసీం అలీ(54) టాప్ స్కోరర్లు గా నిలిచారు. భారత జట్టులో గురు ప్రీత్, సుయాష్ శర్మ చెరి రెండు వికెట్లు పడగొట్టారు.
136 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగిన టీమిండియా కు ప్రారంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. భీకరమైన ఫామ్ లో ఉన్న ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ(12) అంచనాలను అందుకోలేకపోయాడు. వరుసగా రెండు ఫోర్లు కొట్టిన అతడు ఆ తర్వాత ఊహించని విధంగా జై వదేరా బౌలింగ్లో ఔట్ అయ్యాడు. మరో ఓపెనర్ ప్రియాంష్ ఆర్య (10) మరోసారి నిరాశపరిచాడు. ఈ దశలో వచ్చిన నమన్ దీర్(30), హర్ష్ దూబే(53*) అదరగొట్టారు. వీరిద్దరూ 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి.. టీం ఇండియా విజయానికి బాటలు వేశారు. ఈ విజయం ద్వారా టీమ్ ఇండియా సెమి ఫైనల్ వెళ్లిపోయింది.
ఇటీవల పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఓటమిపాలైంది. తద్వారా సెమి ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ దశలో ఒమన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో టీమిండియా అద్భుతమైన ప్రతిభ చూపించింది. ముందుగా బౌలింగ్లో ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. ఆ తర్వాత లక్ష్యాన్ని చేదించడంలో మొదట్లో తడబాటుకు గురైనప్పటికీ.. ఆ తర్వాత స్థిరమైన ఆట తీరు కొనసాగించింది. ఒమన్ జట్టు ఊహించినట్టుగా వైభవ్ గొప్పగా ఆడకపోయినప్పటికీ.. మిగతా ప్లేయర్లు సమష్టి ప్రదర్శన చేయడంతో ఒమన్ జట్టుకు ఓటమిని అందించింది.
వాస్తవానికి ఈ మ్యాచ్లో టీం ఇండియా మీద అంచనాలు ఉన్నాయి. అలాగని ఒమన్ జట్టు సంచలన ప్రదర్శన చేస్తే టీమ్ ఇండియాకు ఇబ్బంది తప్పదని విశ్లేషణలు వినిపించాయి. అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఒమన్ జట్టుకు భారత్ తన బౌలింగ్ ద్వారా దిమ్మ తిరిగేలా చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్లో అదరగొట్టింది. వైభవ్ సూర్య వంశీ విఫలమైనప్పటికీ.. భారీ అంచనాలున్న ప్రియాంష్ ఆర్య కూడా విఫలమయ్యాడు దీంతో టీమిండియా తడబాటుకు గురయింది ఈ దశలో నమన్ దీర్, వదేరా బలంగా నిలబడ్డారు. చివరికి టీమిండియాను గెలిపించారు.