Today 16 July 2025 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశరాసులపై ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో ఉద్యోగులు ఈరోజు కార్యాలయాల్లో సంతోషంగా గడుపుతారు. 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : . కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు ఉంటాయి. వీటిని వెంటనే పరిష్కరించుకోవాలి. లేకుంటే మరింత పెద్దదిగా మారే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పై ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలి. ఏ చిన్న సమస్య వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. వ్యాపారులు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేకుంటే బాగా స్వాముల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఈ రాశి వారు ఈరోజు కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. విద్యార్థులు అనుకోకుండా పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. దూర ప్రయాణాలు చేసేవారు సొంత వాహనాలపై కాకుండా ఇతర వాహనాలపై వెళ్ళాలి. ఉద్యోగులు అదనపు ప్రాజెక్టులను చేపట్టడానికి ఉత్సాహం చూపిస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): వ్యాపారులకు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండడమే మంచిది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఇంట్లో ఒకరి వివాహం కోసం చర్చిస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇతరుల నుంచి డబ్బు సేకరిస్తారు. అయితే ఈ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : నాణ్యమైన ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. అనవసరపు వివాదాల్లోకి తల దూర్చొద్దు. వ్యాపారులు ఏదైనా సంభాషణ చేసేటప్పుడు ఓపిగ్గా ఉండాలి. కుటుంబ సభ్యులతో సంయమన ఉంటుంది. పెద్దల సలహాతోని కొత్తగా పెట్టుబడులు పెట్టాలి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . వ్యాపారులు కొన్ని పనులు పూర్తి చేయడానికి తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో పాత ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య సంయమనం లోపించడంతో సమస్యలు వస్తాయి. వీటిని వెంటనే పరిష్కరిస్తారు. విద్యార్థులు తమ కెరీర్ గురించి కీలక నిర్ణయం తీసుకుంటారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . కొన్ని పనుల కారణంగా ఈరోజు బిజీ వాతావరణం లో ఉంటారు. అయితే విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే సరైన ఫలితాలు పొందుతారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతారు. కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు ఏర్పడితే మౌనంగా ఉండడమే మంచిది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఏ పని చేపట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు. అయితే ఉద్యోగులు తోటి వారితో వాదనలకు దిగకుండా ఉండాలి. వ్యాపారులు కొత్త భాగస్వాములను చేసుకునే సమయంలో ఆచితూచి వ్యవహరించాలి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : వ్యాపారాలు కీలక నిర్ణయం తీసుకునే సమయంలో బాగా ఆలోచించాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విదేశాల్లో ఉండే వారి నుంచి కీలక సమాచారం అందుకుంటారు. బ్యాంకు నుంచి రుణం తీసుకోవాల్సి వస్తే ధ్రువ పత్రాలను జాగ్రత్తగా చూసుకోవాలి. కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసేవారు పెద్దల సలహా తీసుకోవాలి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . నాణ్యమైన ఆహారం కోసం ప్రయత్నించాలి. లేకుంటే ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏవైనా సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించుకోవాలి. విద్యార్థుల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు ఆందోళనగా ఉంటుంది. కొన్ని విషయాల్లో తప్పటడుగులు వేస్తారు. అయితే పెద్దల సలహాతో వాటిని పరిష్కరించుకుంటారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అదనపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . చట్టపరమైన వివాదాల నుంచి బయటపడతారు. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసేవారు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం అందుతుంది. కొత్తగా ప్రాజెక్టులు చేపట్టేవారు అధికారుల నుంచి మద్దతు పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : వ్యాపారులు ఈరోజు తోటి వారితో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాలలో అలసట ఏర్పడుతుంది. అయితే వైద్యులను సంప్రదించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అనుకోకుండా కుటుంబ సభ్యుల్లో ఒకరికి అనారోగ్యం ఏర్పడుతుంది. నీతో మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.