spot_img
Homeఆధ్యాత్మికంToday 15 May 2026 Horoscope: ఈ ఐదు రాశుల ఉద్యోగులకు గుడ్ న్యూస్..

Today 15 May 2026 Horoscope: ఈ ఐదు రాశుల ఉద్యోగులకు గుడ్ న్యూస్..

Today 15 May 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అశ్విని నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకోకుండా లాభాలు పెరిగే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈరోజు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి వస్తుంది. ఒక పనిని పూర్తి చేయడానికి స్నేహితుల సహాయం తీసుకుంటారు. ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి. సమాజంలో గౌరవం లభిస్తుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులు కొత్త ఉద్యోగానికి కోసం చేసే ప్రయత్నం సక్సెస్ అవుతుంది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. అనుకోకుండా శుభ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. పెద్దల సహాయంతో కొత్త పెట్టుబడులు పెడతారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు విదేశాల నుంచి శుభవార్తను వింటారు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. దీంతో ఆహ్లదంగా ఉండగలుగుతారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. ఎవరితోనూ అనవసరమైన వాదనలకు దిగకుండా ఉండాలి

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు తల్లిదండ్రులపై ప్రత్యేక దృష్టి పెడతారు. విద్యార్థులు అనుకోకుండా పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. అధికారుల మద్దతుతో ఉద్యోగులు పదోన్నతులు పొందుతారు. వ్యాపారులు లాభాలు పొందాలంటే కష్టపడాల్సి వస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ఒక శక్తివంతమైన నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారంలో అధిక లాభాలు పొందే అవకాశం ఉంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి అన్ని విధాలుగా ఏర్పాటు చేసుకుంటారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు కష్టమైనా కొన్ని పనులు పూర్తి చేస్తారు. గతంలో పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు వైవాహిక జీవితం సంతోషంగా గడుస్తుంది. జీవిత భాగస్వామి కోసం ప్రత్యేకంగా వస్తువులు కొనుగోలు. అనుకోకుండా డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంది.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు సమాజంలో గౌరవం పొందుతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులనుంచి శుభవార్తలు వింటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే ఇదే మంచి సమయం. ఉద్యోగులకు అదనంగా జీతం పెరిగే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు కొత్త అవకాశాలను పొందుతారు. గతంలో మొదలు పెట్టిన పనులను ఈరోజు విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో పోటీ పరీక్షల్లో రాణిస్తారు. వ్యాపారులకు మెరుగైన ఫలితాలు ఉంటాయి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఎవరితోనూ అనవసరమైన వాదనలకు దిగకుండా ఉండాలి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు అనుకోకుండా లాభాలు పొందుతారు. కొత్తగా పెట్టుబడి పెట్టే వారికి ఇదే మంచి సమయం. ఉద్యోగులు పదోన్నతులు పొందడంతో సంతృప్తిగా ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసి విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సొంత వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు అనుకోకుండా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. గతంలో మొదలు పెట్టిన పనులను ఇప్పుడు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో శుభవార్తను అందుతాయి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించడం మంచిది.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు సంతోషమైన జీవితాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడితే వెంటనే పరిష్కరించుకోవాలి. స్నేహితులతో సరదాగా ఉంటారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం పెరుగుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అనుకుంటే ఇదే మంచి సమయం. సమాజంలో గౌరవం లభిస్తుంది.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పెట్టే పెట్టుబడుల నుంచి అధిక ఆదాయం పొందుతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను త్వరగా పూర్తి చేస్తారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular