Today 13 April 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై ధనిష్ట నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొందరి వ్యాపారులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో అధిక లాభాలు పొందుతారు. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈ రోజు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం పెరిగినా కూడా కొన్ని విషయాల్లో అనవసరపు ఖర్చులు ఉండే అవకాశం ఉంటుంది. వ్యాపారాలు ప్రత్యర్థుల విషయంలో చాకచక్యంగా వ్యవహరించాలి. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో అనుకున్న పనులు ఇన్ టైం లో పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. దీంతో కొత్త పరిచయాలు పెరుగుతాయి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి. బంధువుల నుంచి ధన సహాయం అందుతుంది.
మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటే పెద్దలను సంప్రదించడం మంచిది. ఇప్పటికే వ్యాపారం చేసేవారికి కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల్లో ఒకరి ప్రవర్తనడం వల్ల మనస్థాపం చెందుతారు. ఇలాంటి సమయంలో ఓపికతో వ్యవహరించాలి. విద్యార్థుల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని విధాల కలిసి వస్తుంది. ఉద్యోగులకు తోటి వారి సహాయం ఉండడంతో ప్రాజెక్టులను సమయంలో పూర్తి చేస్తారు. కొన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా ధైర్యంగా ముందుకు వెళ్లడంతో అనుకున్న పనులు సమయానికి పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు ఉండడంతో పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. అనుకోకుండా శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు ఉంటాయి. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో పదోన్నతి పొందే అవకాశం ఉంటుంది.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. కొన్ని ముఖ్యమైన పనులలో అనుకున్న సమయంలో పూర్తి చేయగలుగుతారు. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. వ్యాపారులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటాయి. దీంతో అదిక లాభాలు పొందుతారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు శుభప్రదమైన దినంగా గడుస్తుంది. చాలాకాలంగా పెండింగ్లో ఉన్న పనులు ఈరోజు పూర్తవుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉద్యోగులు కొన్ని ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఇతరుల సహాయం తీసుకుంటారు. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : . ఈ రాశి వారికి ఈ రోజు కొన్ని ప్రతికూలమైన వాతావరణ ఉండే అవకాశముంది. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలి. జీవిత భాగస్వామితో విభేదాలు ఉంటాయి. ఇలాంటి సమయంలో మౌనంగా ఉండడమే మంచిది. వ్యాపారులకు కాస్త నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యాపారులకు భాగస్వాముల సహకారం ఉండడంతో అధిక లాభాలు పొందుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని శుభ ఫలితాలే ఉండలు ఉన్నాయి. ఉద్యోగులు తోటి వారి సహాయంతో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వ్యాపారులకు అనుకూలమైన వాతావరణము ఉండడంతో గతంలో కంటే ఇప్పుడు లాభాలు పొందుతారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. అధికారుల నుంచి ప్రశంసలు ఉండడంతో ఉద్యోగులు పదోన్నతి పొందే అవకాశం ఉంటుంది.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు అనుకోకుండా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో కొన్ని మార్పులు ఉంటాయి. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఇంటి నిర్మాణానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండాలి.