Today 11 August 2025 Horoscope: గ్రహాల మార్పుతో కొన్ని రాశులపై ప్రభావం ఉంటుంది. సోమవారం కొన్ని రాశుల వారికి అనుకూలమైన వాతావరణం ఉండనుంది. మేషం తో సహా మీనం వరకు మొత్తం రాసిన ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఆస్తి వివాదాలు సమసి పోతాయి. ఉద్యోగులు తమ భవిష్యత్తు గురించి కీలక నిర్ణయం తీసుకుంటారు. గతంలో చేసిన వీరి పనులకు ప్రమోషన్ లభిస్తుంది. ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి. వ్యాపారులకు పని భారం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షల గురించి శుభవార్తలు వింటారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులకు అనుకోకుండా ఆదాయం వస్తుంది. అర్హులైన వారికి వివాహ ప్రయత్నాలు సాగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి దైవ క్షేత్రాలు సందర్శిస్తారు. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి. పెట్టుబడులు పెట్టేముందు పెద్దల సలహా తీసుకోవాలి m
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): . స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు పలుస్తాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. గతంలో చేసిన పనుల నుంచి ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. మానవ సంబంధాలు మెరుగుపడతాయి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఉద్యోగుల జీవితం సాధారణంగా ఉంటుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఇంటికి బంధువుల రాకతో సందడిగా ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. స్నేహితుల వల్ల ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులను వాయిదా వేయకుండా ఉండాలి. తల్లిదండ్రుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఒత్తిడి నుంచి విముక్తి పొందుతారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . సమాజంలో గుర్తింపు లభిస్తుంది. వ్యాపార లావాదేవీలు ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యక్తులతో ఆర్థిక వ్యవహారాలు జరపకుండా ఉండాలి. కొందరు స్నేహితులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. నిరుద్యోగులు ఒక కంపెనీ నుంచి శుభవార్త వింటారు. చిన్ననాటి స్నేహితులను కలవడంతో ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చూస్తారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారు ఈ రోజు ఆదాయం తక్కువగా పొందుతారు. దీంతో కాస్త ఆందోళనగా ఉంటుంది. అయితే మానసిక ఉల్లాసానికి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఏర్పడే అవకాశం ఉంది. గతంలో ఉన్న ఓ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా వ్యాపారులు లాభాలు పొందే అవకాశం ఉంది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు వ్యక్తిగత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. నిరుద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంది. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దల సలహాలు తీసుకోవాలి. పెండింగ్ లో ఉన్న బాకీలు వసూలు అవుతాయి. కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగులు అదనపు ఆదాయాన్ని పొందుతారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) :. జోకులు అదనపు ఆదాయాన్ని పొందుతారు. వీరికి అన్ని రకాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దల సలహా తీసుకోవాలి. ఆస్తి వివాదాల గురించి శుభవార్తను వింటారు. కొన్ని నిర్ణయాలు తీసుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . ఉద్యోగులు మానసికంగా ఒత్తిడితో ఉంటారు. వ్యాపారులకు అనుగుణ లాభాలు వస్తాయి. కొత్తగా ఏ పని చేపట్టాలన్న ఈరోజు అనుకూలమైన వాతావరణ ఉంది. దూరపు బంధువుల నుంచి ధన సహాయం అందుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారులు కొత్త భాగస్వాములను చేర్చుకోవాల్సి వస్తే వారితో జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి ఈరోజు సానుకూలంగా ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు ఉంటే వాటిని వెంటనే పరిష్కరించుకోవాలి. వృధా ఖర్చులను నియంత్రించుకోవాలి. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తికావడానికి సమయం పడుతుంది. ఉద్యోగులకు అదనపు ఆదాయం అందుతుంది. నిరుద్యోగులు కీలక బాధ్యతలు చేపడతారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . వృత్తి వ్యాపారాలు ఖర్చులు పెరుగుతాయి. అయితే ఇతరుల వద్ద నుంచి వచ్చే డబ్బును జాగ్రత్తగా వసూలు చేసుకోవాలి. అదనపు ఆదాయం పొందుతారు. అర్హులైన వారికి వివాహ ప్రయత్నాలు జరుగుతాయి. అనుకోకుండా ప్రయాణాలు ఉంటాయి. ఈ సమయంలో సొంత వాహనాలపై వెళ్లకుండా జాగ్రత్తపడాలి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు వస్తాయి. పిల్లల కెరీర్ పై శుభవార్తలు వింటారు. బంధువులకు ధన సహాయం చేస్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి.