War 2 Pre Release Event NTR Angry: తమ అభిమాన హీరో ని చూసినప్పుడు కానీ, ఆ అభిమాని హీరో మాటలు విన్నప్పుడు కానీ వాళ్లకి తెలియకుండానే అభిమానుల శరీరాల్లో ఒక కరెంటు పాస్ అవుతుంది. ఆ సమయం లో ఏమి చెయ్యాలో తెలియక ఈలలు వేస్తూ, అరుస్తూ ఉంటారు. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరో ని అభిమానులు దేవుడి లెక్క కొలుస్తుంటారు. ఇలాంటి అభిమానులు అరుపులు అత్యధికంగా మన తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), ఎన్టీఆర్(Junior NTR) మీటింగ్స్ లో జరుగుతుంటాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈవెంట్స్ లో అయితే ఆయన్ని అభిమానులు క్షణం కూడా మాట్లాడనివ్వరు. వాళ్ళ అభిమానం ని చూసి ఆనందపడాలో, లేకపోతే ప్రసంగం ఇస్తున్నప్పుడు డిస్టర్బ్ చేస్తున్నారని కోపడ్డాలో తెలియని పరిస్థితి. నిన్న జరిగిన ‘వార్ 2′(War 2 Movie) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ కోప్పడ్డాడు. ఆయన్ని ఇంత కోపం గా ఇది వరకు ఎవ్వరూ చూసుండరు.
Also Read: నేను కాదు..ఇండియాలో నెంబర్ 1 డాన్సర్ హృతిక్ రోషన్ మాత్రమే
ఆయన మాట్లాడుతున్నప్పుడు క్రింద ఉన్నటువంటి అభిమానులు నినాదాలు చేస్తుండడాన్ని గమనించిన ఎన్టీఆర్ ‘బ్రదర్..వెళ్ళిపోమంటావా..?,వెల్లిపోనా..?, నేనేమన్నాను?, మాట్లాడేటప్పుడు సైలెంట్ గా ఉండండి, నాకు ఒక్క సెకండ్ సమయం పట్టదు, మైక్ విరిచి వెళ్ళిపోతాను. ఓకే?, మాట్లాడనా?, తట్టుకొంది కాసేపు’ అంటూ అభిమానులకు చివాట్లు పెడుతాడు ఎన్టీఆర్. అయితే దీనిపై సోషల్ మీడియా లో ఇతర హీరోల అభిమానులు తమ హీరోలకు అలాంటి సందర్భం వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు?, ఎన్టీఆర్ ఎలా రియాక్ట్ అయ్యాడు అంటూ పోలుస్తూ సోషల్ మీడియా లో పోస్టులు వేస్తున్నారు. అభిమానులు అన్న తర్వాత ఉత్సాహంతో అలాగే అరుస్తారు, వాటిని ఎంజాయ్ చెయ్యాలి, ఎంజాయ్ చేయలేకపోయినా, కనీసం వాళ్ళ ఆనందాన్ని అలా వదిలేయాలి, కాసేపు అయ్యాక వాళ్ళే సెటిల్ అవుతారు. ఇంత చిన్న దానికి ఎన్టీఆర్ అంత ఓవర్ యాక్షన్ చేయడా అవసరమా అంటూ ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మరికొంతమంది అయితే ఎన్టీఆర్ ని సపోర్ట్ చేస్తున్నారు. మాట్లాడేటప్పుడు బుద్ధిగా వినాలి, అలా చేయకుండా ప్రసంగం మధ్యలో అరిస్తే ఎవరికైనా చిరాకు కలుగుతుంది. ఎన్టీఆర్ కి కూడా అలాంటి చిరాకే కలిగింది. ఆయన కూడా మన లాంటి సాధారణ మనిషే కదా?, ఆయనకు కూడా కోపం వస్తుంది కదా?,అభిమానులు సమయానికి తగ్గట్టుగా నడుచుకోవాలి అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా మొత్తానికి నిన్న ఎన్టీఆర్ అలా అభిమానుల పై కోపం తెచ్చుకోవడం మాత్రం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
#JrNTR Snapped at an Overexcited Fan.
“మాట్లాడేటప్పుడు Silent గా ఉండండి.” pic.twitter.com/t7LuwTtlJE
— Gulte (@GulteOfficial) August 10, 2025