Hrithik Roshan comments On NTR: ఎన్టీఆర్(Junior NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘వార్ 2′(War 2 Movie) మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా నిన్న హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పెరేడ్ గ్రౌండ్స్ లో ఈ సినిమాకు సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ తో పాటు హృతిక్ రోషన్ కూడా పాల్గొన్నాడు. ఎన్టీఆర్ లో ఎదో మ్యాజిక్ ఉంది. ఆయనతో పని చేసే ఎవ్వరైనా వ్యక్తిగతంగా అతనికి బాగా కనెక్ట్ అయిపోతూ ఉంటారు. #RRR సినిమా సమయం లో రామ్ చరణ్ కూడా ఇలాగే కనెక్ట్ అయ్యాడు. ఇప్పుడు ‘వార్ 2’ సమయంలో హృతిక్ రోషన్ కూడా అదే రేంజ్ లో కనెక్ట్ అయ్యాడు. ఎన్టీఆర్ గురించి ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
Also Read: నేను కాదు..ఇండియాలో నెంబర్ 1 డాన్సర్ హృతిక్ రోషన్ మాత్రమే
హృతిక్ రోషన్ మాట్లాడుతూ ‘అందరికీ నమస్కారం..ఎలా ఉన్నారు?, ఇంత ఓపిక చేసుకొని ఇక్కడికి వచ్చినందుకు, మాకు ఇంత ఘన స్వాగతం పలికినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నాకు ఒక్కసారి టైగర్ ఫ్యాన్స్ గర్జన వినాలని ఉంది’ అని అడుగుతాడు. ఆడియన్స్ నుండి పెద్ద రెస్పాన్స్ వస్తుంది. అనంతరం మాట్లాడుతూ ‘తారక్ మీ అందరికీ అన్నయ్య..కానీ నాకు మాత్రం తమ్ముడు. మేమంతా ఒకే ఫ్యామిలీ గా ఉంటాము. చాలా కాలం క్రితం నేను హైదరాబాద్ లో క్రిష్ మూవీ షూటింగ్ చేసాను. ఆ సమయం లో తెలుగు ప్రజలు నా మీద చూపించిన ప్రేమాభిమానాలను నేను ఎప్పటికీ మర్చిపోలేను. మళ్ళీ ఇప్పుడు మీ ముందుకు వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఇప్పుడు ‘వార్ 2′ విడుదల అవ్వడానికి కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. యుద్దానికి మీరంతా సిద్ధమా’ అంటూ చెప్పుకొచ్చాడు హృతిక్ రోషన్.
ఇక ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ‘వార్ 2 మూవీ షూటింగ్ లో మా ఇద్దరి జర్నీ కో స్టార్స్ గా మొదలైంది. సినిమా పూర్తి అయ్యేలోపు మేము నిజ జీవితం లో మేము బ్రదర్స్ లాగా మారిపోయాము. ఈరోజు నేను మీ నుండి ఒక ప్రమాణం కోరుకుంటున్నాను. మీరు ఇప్పుడు నా తమ్ముడి మీద చూపిస్తున్న ప్రేమ జీవితాంతం ఇలాగే చూపించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అతను ఈ ప్రేమకు అర్హుడు. ఎన్టీఆర్ లో నన్ను నేను చూసుకున్నాను. ఆయన కూడా అనేక సందర్భాల్లో తనని నాలో చూసుకున్నాడు. ఎన్టీఆర్ ఎలాంటి టేక్ ని అయిన సింగిల్ షాట్ లో చేసేస్తాడు. నూటికి నూరు శాతం అది పర్ఫెక్ట్ గా ఉంటుంది. నేను ఆయన నుండి అది నేర్చుకున్నాను. భవిష్యత్తులో నేను చెయ్యబోయే సినిమాల్లో కూడా నేను ఆయన నుండి నేర్చున్నది పాటిస్తాను. మీ అందరికి తెలుసో లేదో, ఎన్టీఆర్ అద్భుతంగా వంట చేస్తాడు. నాకు ఆయన ఒక ప్రామిస్ ఇవ్వాలి, భవిష్యత్తులో మేము మళ్ళీ కలిసి సినిమా చేస్తామో లేదో నాకు తెలియదు, కానీ నీ నుండి తయారు చేయబడిన బిర్యానీ నుండి మాత్రం నన్ను దూరం చెయ్యకు’ అంటూ చెప్పుకొచ్చాడు హృతిక్ రోషన్.
