Today 10 March 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాసిన వారికి అనుకోకుండానే శుభ ఫలితాలు జరగనున్నాయి. మరికొన్ని రాశుల వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,p): ఈ రాశి వారు ఈ రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారులు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. వీటి పరిష్కారానికి కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వీరికి గురువుల మద్దతు ఉంటుంది. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు అనుకున్న పనులు అన్నీ పూర్తి చేస్తారు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. అనుకోకుండా శుభ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుంది. తల్లిదండ్రుల ఆశీస్సులతో విద్యార్థులు పోటీ పరీక్షలో రాణిస్తారు. ఉద్యోగులకు అదనపు ఆదాయాలు చేకూరుతాయి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో పదోన్నతి విషయంలో శుభవార్తలు వింటారు. అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. దీంతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. వివాదాల నుంచి బయటపడతారు. ఇతరులకు ఇచ్చిన మాటను నెరవేరుస్తారు. కొన్ని పనులు పూర్తికావడానికి అడ్డంకులు ఏర్పడతాయి. అయినా కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. పెద్దల సలహా ఉంటుంది.
.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు అన్ని పనులను పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగులకు తోటి వారి మద్దతు ఉండడంతో ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతారు. ఆన్లైన్లో పెట్టుబడును పెట్టే వారికి అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారు ఈరోజు పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వైవాహిక జీవితంలో మార్పులు రానున్నాయి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టే ముందు పెద్దలను సంప్రదించడం మంచిది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యుల మధ్య గడుపుతారు. వ్యాపారానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులు అదనపు ఆదాయాన్ని పొందుతారు. ప్రయాణాలు చేసేటప్పుడు అసౌకర్యాన్ని పొందుతారు. అయితే సొంత వాహనాలపై వెళ్లడమే మంచిది. విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించే వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆగిపోయిన పనులను పూర్తి చేస్తారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది. అయితే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడినప్పుడు మౌనంగా ఉండటమే మంచిది. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉంటుంది. అయితే కార్యాలయంలో పని భారం ఎక్కువవుతుంది. వ్యాపారులకు ప్రత్యర్థుల బెడద ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఓపికతో నిర్ణయాలు తీసుకోవాలి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే గురువుల మద్దతు ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులకు ఆవిష్కరణలు చేస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వ్యక్తిగత ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక లాభాలు ఎక్కువగా ఉంటాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి ఇదే సరైన సమయం. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడతాయి. ఇలాంటి సమయంలో ఓపిక చాలా అవసరం. వ్యాపారులకు తోటి వారి మద్దతు ఉండడంతో అధిక లాభాలు పొందుతారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు సమాజంలో గౌరవం పొందుతారు. అయితే మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తోటి వారి నుంచి ప్రతికూలమైన వాతావరణం ఉంటుంది. స్నేహితులల్లో ఒకరు మోసం చేసే అవకాశం ఉంటుంది. డబ్బు వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి . ప్రియమైన వారి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈరోజు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు. వ్యాపారులకు పెట్టుబడులు పెట్టేందుకు పెద్దల మద్దతు ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి.